#IskconPrabhupada : ప్రభుపాద శ్రీకృష్ణం ప్రపంచమయం
అలౌలిక ఆనందం శ్రీకృష్ణ తత్వం
Iscon Prabhupada: కృష్ణా నీవే అంటూ హరిహరన్ పాడుతుంటే మనసు అలౌకికమైన దారుల్లో సంచరిస్తుంది. ఉన్నాడో లేడో తెలియని సందిగ్ధావస్థ స్థితిలోంచి కోట్లాది జనాన్ని భక్తులుగా మార్చిన ఘనత ఆ కృష్ణుడిదే. వెన్న దొంగగా, ఆరాధ్య దైవంగా వినుతికెక్కిన ఆయన బోధించిన భగవద్గీత ఇవాళ ప్రతి ఇంట్లోకి చేరిపోయింది. ఎంతలా అంటే విడదీయలేనంతగా. ప్రతి చోటా..ప్రతి నోటా కృష్ణా అన్న పదమే వినసొంపుగా..వినమ్రంగా..విశ్వ వ్యాప్తంగా..నిత్యం..నిరంతరం..లోకమంతటా వినిపిస్తోంది.
ఎలాంటి భేషజాలు లేకుండా..అహం అన్నది దరిచేరకుండా మనుషులుగా ఎలా ఉండాలో..ఎలా వ్యవహరించాలో..ఎలా బతకాలో బోధించారు..కోట్లాది భక్తులకు తన ప్రవచనాల ద్వారా సందేశాలను చేరవేశారు. ఈ ప్రపంచ గతి శీలతను మార్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ లోకాన్ని సంస్కరించిన మహానుభావులు లక్షలాది మంది ఉన్నారు. వారిప్పుడు భౌతికంగా లేరు. కానీ వారు సూచించిన మార్గాలు, వారు నడిచిన అడుగు జాడలన్నీ నేటికీ స్ఫూర్తిని కలిగిస్తున్నాయి.
దైవం సమానం..కానీ మన మనస్సులు మాత్రం ఒక చోట కుదురుగా ఉండవు. ఉండలేవు కూడా. ఎందుకంటే స్పందించే గుణం వీటికి మాత్రమే ఉన్నది. స్వీయ నియంత్రణ, స్వీయ పరిశీలన..స్వీయ ఆరాధన..స్వీయ కట్టుబాట్లు ఏర్పాటు చేసుకోగలిగితే జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకునే మార్గం ఏర్పడుతుంది అంటారు ప్రభుపాదుల స్వాముల(Iscon Prabhupada) వారు. ఆయన ఎవ్వరినీ కోరలేదు..ఇంకెవ్వరినీ ఆదేశించనూ లేదు.
ఆయన బోధించింది..ఆచరించింది ఒక్కటే కృష్ణా..కృష్ణా..నీవే లోకం..నీవే సర్వస్వం. ప్రభుపాదులతో ప్రారంభమైన ఇస్కాన్ ఇపుడు ప్రపంచాన్ని చుట్టేసింది. ఎక్కడ చూసినా కృష్ణా అన్న సంస్మరణే. ఆచరణాత్మకంగా లేకుండా ఏదీ ఉండదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ నశిస్తుంది. తిరిగి ప్రాణం పోసుకుంటుంది. ఎక్కడో లేని దైవం కోసం ఎందుకు ఈ ఆరాటం. ఆలయాలు, సంతర్పణలు అన్నీ దేని కోసం. సంతృప్తి లేని సంస్కారం ఉండీ ఏం ప్రయోజనం.
మానవ జన్మ ఉత్కృష్ణమైనది..పదుగురితో పంచుకునే సౌలభ్యం ఈ జాతికి మాత్రమే ఉన్నది. కర్మ ఒక్కటే పరిష్కారం. కర్మ అంటే వదిలించు కోవడం కాదు త్రికరణ శుద్ధితో పనిలో నిమగ్నం కావడం. అదే ఆచరణ..ఏది చెబుతామో..ఏది మాట్లాడతామో..అదే ఆచరించాలి. అదే శ్రీకృష్ణుడు బోధించింది. గీతా ప్రచార(Iscon Prabhupada)క్ సంస్థ ఉచితంగా భగవద్గీతను అందజేస్తోంది. ఒకరి నుంచి మరొకరికి సందేశం చేరాలి. ఇది కూడా ఆచరణలో భాగమే. జరిగేది ..జరగబోయేది..అంతా మన మంచికే.
మిగిలేది పిడికెడు మట్టే నన్న వాస్తవాన్ని గుర్తెరిగితే చాలు. సేవాతత్పరత ..ప్రేమానుభవం రెండూ మనుషులకు కావాల్సింది. అప్పుడే భక్తి తత్వం బోధ పడుతుంది. అది ఆచరించేందుకు వీలవుతుంది. ధ్యానం..యోగం..ఈ రెండూ జీవితంలో భాగం కావాలి. అప్పుడు గురువు అంటూ ఎవ్వరూ అవసరం లేదు. ఆ కృష్ణ భగవానుడు బోధించిన గీతోపదేశం నీ చేతుల్లో ఉంటే చాలు. కొండంత బలాన్ని ఇస్తుంది..కోరుకున్న దానిని పొందేలా చేస్తుంది.
కర్మానుసారం ప్రయాణం చేయడం ఒక్కటే చేయాల్సింది. మిగతా ఫలితం మాత్రం నీకు అనుగుణంగానే వస్తుంది అంటారు ప్రభుపాదుల వారు. వేలాది భాషల్లోకి అనువాదం చేయబడింది గీత. లక్షలాది మంది దానిని తమ దైవంగా భావిస్తున్నారు. కోట్లాది మంది గీతను చదువుతూ..ఆచరిస్తూ ..మేనేజ్‌మెంట్ గురువులుగా, మెంటార్స్ గా, మార్గదర్శకులుగా, అత్యున్నత పదవుల్లో ఉన్న వారంతా తమ వద్ద భద్రంగా దాచుకుంటున్నారు. కర్మ అంటే క్రియ..అర్థం..పనిలో ఉండమని.
ప్రతి ఆలోచన కూడా పనితో ముడి పడి ఉన్నదే. నిష్టతో ఉండండి. ఏకాగ్రతను వీడకండి..మనో నిబ్బరాన్ని పాటించండి. పరుల పట్ల ప్రేమను పంచండి. ఆ శక్తి భక్తులను శక్తిమంతులుగా, కార్యనిర్వాహకులుగా, విజేతలుగా తయారు చేసే బలాన్ని ఇస్తుంది. కృష్ణుడు బోధించింది పూజలు చేయమని కాదు..ప్రేమను పంచండి..సేవలోనే తరించండి..జన్మను ధన్యం చేసుకోండి. నీలో ఉన్న మాలిన్యం తొలిగి పోవాలంటే..నిన్ను నీవు సంస్కరించు కోవాలంటే..పదుగురికి ఆదర్శవంతమైన వ్యక్తిగా ఎదగాలంటే.
ఒక్కటే మార్గం..ఇవ్వడం అలవాటుగా మార్చుకో..అదే నీకి తిరిగి ఇస్తుంది. నీలో అనంతమైన శక్తికి ప్రాణం పోస్తుంది. ఆచరణ ఒక్కటే అనుసరణీయం..అనుభవం ఒక్కటే ఆనంద దాయకం. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ప్రత్యేకమైన మనుషులమని భావించరాదు. ఆహారం అన్నది ఒక భాగం మాత్రమే. కావాల్సిందల్లా మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడం. అంటే సేవలో నిమగ్నం కావడమే. ప్రభుపాదుల వారు బతికే ఉన్నారు..లోకంలో ఇస్కాన్ రూపంలో..శ్రీకృష్ణుడి ఆత్మలో..ఆయన నిలిచే ఉన్నారు. ప్రతి ఆలయంలో దీపారాధనలో వెలుగులు ప్రసరించేలా చేస్తున్నారు. కృష్ణా నీవే(Iscon Prabhupada)..అంటూ పాడు కోవడమే ఇక మిగిలింది.
No comment allowed please