Hema Malini : కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల జపం చేస్తోంది. దానికి తగ్గట్టు గానే ఆ పార్టీకి చెందిన నేతలు కూడా రైతుల ఉద్యమాన్ని కించ పరిచేలా మాట్లాడుతున్నారు. ఆ జాబితాలోకి కొత్తగా ప్రముఖ నటి హేమమాలిని చేరారు. కేంద్ర సర్కార్ తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో 49 రోజులుగా పోరాటం చేస్తున్నారు రైతులు ఢిల్లీలో. ప్రస్తుతం ఆమె యుపీలోని మథుర ఎంపీ గా ఉన్నారు.
అన్నదాతలకు అసలు ఏం కావాలో తెలియదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు ఆందోళన చేపట్టారో తనకు అర్థం కావడం లేదన్నారు. రైతులు తమంతకు తాముగా ఈ కార్యక్రమాన్ని చేపట్డం లేదని అన్నారు. కొన్ని వ్యతిరేక శక్తులు వారి వెనుక ఉండి నడిపిస్తున్నట్లు తనకు అనుమానం కలుగుతోందన్నారు. అదే విధంగా నూతన చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని హేమమాలిని స్వాగతించారు. తద్వారా పరిస్థితులు చక్క బడేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ఇప్పటి దాకా పలు దఫాలుగా కేంద్రం రైతులతో, వారి ప్రతినిధులతో చర్చలు జరిపిందని అయినా వారు ఏకాభ్రిప్రాయానికి రాలేక పోతున్నారని అన్నారు. వారు ఏం కోరుకుంటున్నారో రైతులకు తెలిసి రావడం లేదన్నారు. రైతుల నిరసన వల్ల పంజాబ్ లో నష్టం ఏర్పడిందని, సెల్ టవర్లను ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదన్నారు హేమమాలిని. ఆమె కామెంట్లపై రైతు ప్రతినిధులు, మేధావులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
No comment allowed please