Yash : మామూలోడు కాదు ద‌మ్మున్నోడు

సినీలోకంలో య‌శ్ వెరీ వెరీ స్పెష‌ల్

Yash  : భార‌త దేశ సినీ చ‌రిత్ర‌లో అతడో సునామీ. అద్భుత‌మైన న‌ట‌న‌తో ఒక్క‌సారిగా త‌న వైపు చూసుకునేలా చేసుకున్నాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఒకే ఒక్క సినిమా అత‌డిని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది.

ఆ ఒక్క సినిమా రికార్డుల‌ను తిర‌గ రాసింది. క‌ర్నాట‌క లోని భువ‌న‌హ‌ల్లి య‌శ్ స్వ‌స్థ‌లం.

1986 జ‌న‌వ‌రి 8న పుట్టాడు. య‌శ్ సినిమా పేరు కానీ ఆయ‌న అస‌లు పేరు న‌వీన్ కుమార్ గౌడ్. భార్య రాధికా పండిట్.

ఇద్ద‌రు పిల్ల‌లు. కేజీఎఫ్ కొట్టిన దెబ్బకు ఏ సినిమా నిల‌వ‌లేక పోయింది. క‌న్న‌డ నాట త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉన్నాడు య‌శ్(Yash ).

తండ్రి అరుణ్ కుమార్ క‌ర్ణాట‌క రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌లో డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తున్నాడు.

త‌ల్లి పుష్ప ల‌త‌. చెల్లెలు నందిని. చిన్న‌ప్పుడు మైసూర్ లో పెరిగాడు. మ‌హాజ‌న స్కూల్ లో చ‌దువుకున్నాడు.

ప్ర‌ముఖ నాటక ర‌చ‌యిత బీవీ కారంత్ ఏర్పాటు చేసిన బెన‌కా డ్రామా టీంలో చేరాడు.

స్టేజ్ షోస్ , టీవీ సీరియ‌ల్స్ లో అరంగ్రేటం చేశాడు య‌శ్. న‌టుడే కాదు మంచి గాయ‌కుడు కూడా.

త‌న ప్రాణ స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణంతో ఒక్క‌సారిగా కుంగి పోయాడు.

2004లో త‌న కెరీర్ ను 2004లో ఉత్త‌రాయ‌ణ టీవీ సీరియల్ తో ప్రారంభ‌మైంది. నందా గోకుల‌, ప్రీతి ఇల్లాడ మేలే, శివ‌ల‌లో టెలీ సీరియ‌ల్స్ లో న‌టించాడు.

నంద గోకుల సెట్స్ పై ఉన్న సమ‌య‌మంలో రాధిక పండిట్ తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

2016 డిసెంబ‌ర్ 9న పెళ్లి చేసుకున్నాడు. ఇవాళ య‌శ్ పుట్టిన రోజు. 2007లో జంబాడా హుడుగి, 2008లో మొగ్గినా మ‌న‌సు, రాకీ, 2009లో క‌ల్ల‌ర సంతే, గోకుల‌, 2010లో త‌మ‌స్సు, మొద‌ల‌స‌ల‌, 2011లో రాజ‌ధాని, కిరాత‌క లో న‌టించాడు.

2012లో ల‌క్కీ, జాను, డ్రామా, 2013లో చంద్ర‌, గూగ్లీ, రాజా హులి, 2014లో గ‌జ‌కేస‌రి, మిస్ట‌ర్ అండ్ మిసెస్ రామాచారి, 2015లో మాస్ట‌ర్ పీస్ , 2016లో సంతో స్ట్రెయిట్ ఫార్వ‌ర్డ్ , 2018లో కేజీఎఫ్ చాప్ట‌ర్ -1 , 2020లో కేజీఎఫ్ -2 లో న‌టించాడు.

2009, 2013, 2014, 2015లో ఉత్త‌మ న‌టుడిగా అవార్డులు అందుకున్నాడు. ఏది ఏమైనా య‌శ్ న‌టుడే కాదు మాన‌వ‌త్వం క‌లిగిన వ్య‌క్తి కూడా.

Also Read : పాలిటిక్స్ స‌రే స‌మ‌స్య‌ల మాటేంటి

Leave A Reply

Your Email Id will not be published!