Kieron Pollard : విండీస్ కు ఇది చీక‌టి రోజు

స్కిప్ప‌ర్ కీర‌న్ పోలార్డ్ కామెంట్

Kieron Pollard : సుదీర్ఘ క్రికెట్ చ‌రిత్ర క‌లిగిన వెస్టిండీస్ క్రికెట్ కు అత్యంత విషాద‌క‌ర‌మైన రోజుగా అభివ‌ర్ణించాడు ఆ జ‌ట్టు స్కిప్ప‌ర్ కీర‌న్ పొలార్డ్(Kieron Pollard). ఐర్లాండ్ తో జ‌రిగిన వ‌న్డే సీరీస్ ను 2-1 తేడాతో ఓడి పోయింది.

సీరీస్ కోల్పోయిన అనంత‌రం విండీస్ కెప్టెన్ మీడియాతో మాట్లాడారు. ఈ ఓట‌మిని జీర్ణించు కోలేక పోతున్నామ‌ని అన్నాడు. అత్యంత నిరుత్సాహాన్ని ఈ అప‌జ‌యం క‌లుగ చేసింద‌న్నాడు.

మింగేందుకు క‌ఠిన‌మైన మాత్ర‌గా పేర్కొన్నాడు. ఆండీ మెక్ బ్రైన్ , హ్యారీ టెక్ట‌ర్ వ‌రుస‌గా హాఫ్ సెంచ‌రీలు చేయ‌డంతో ఐర్లాండ్ విండీస్ తో జ‌రిగిన మూడో వ‌న్డే లో రెండు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

దీంతో మొద‌టిసారిగా వెస్టిండీస్ పై విజ‌యం సాధించి సీరీస్ నెగ్గ‌డం ఐర్లాండ్ కు. ఇప్ప‌టికే ప‌లు మార్పులు చేర్పులు చేసింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. సార‌థ్య బాధ్య‌త‌ల‌ను కీర‌న్ పొలార్డ్(Kieron Pollard) కు అప్ప‌గించింది.

అయినా ఆ జ‌ట్టులో ఎలాంటి మార్పు క‌నిపించ‌క పోవ‌డం విశేషం. దీంతో ఈ ఓట‌మిని జీర్ణించు కోలేక పోతున్నామ‌ని పేర్కొన్నాడు పొలార్డ్. తాము అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చినా చివ‌ర‌కు ఫ‌లితం వేరేగా వ‌చ్చింద‌న్నాడు.

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా క‌రేబియ‌న్ లో త‌మ‌కు బ్యాటింగ్ స‌మ‌స్య ఉంద‌న్నాడు. బౌలింగ్ ప‌రంగా తాము కొంత మెరుగ్గా రాణించినా ఆశించిన రిజ‌ల్ట్ రాలేద‌న్నాడు. దీనికి తాను ఎవ‌రినీ నిందంచ‌డం లేద‌న్నాడు.

ఐర్లాండ్ తో ఓట‌మి త‌ర్వాత ఎక్క‌డ పొర‌పాటు జ‌రిగింద‌నే దానిపై లోతుగా చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు కీర‌న్ పొలార్డ్.

Also Read : సార‌థ్యం అన్న‌ది వార‌స‌త్వం కాదు

Leave A Reply

Your Email Id will not be published!