RGV Dhanush : ఈ మధ్య సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు జంటలు విడి పోతున్నారు. తాజాగా దిగ్గజ నటుడు తలైవా కూతురు ఐశ్వర్య హీరో ధనుష్ 18 ఏళ్ల అనంతరం విడి పోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది.
మరో వైపు ఇటీవల అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య, నటి సమంతలు విడి పోయారు. తామిద్దరం ఇక కలిసి ఉండలేమంటూ పేర్కొన్నారు.
ఈ తరుణంలో తారలు విడి పోవడంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు దిగ్గజ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV Dhanush )అలియాస్ ఆర్జీవీ. ఆయన ఏకంగా పెళ్లి చేసుకుని నరకం అనుభవించడం కంటే ప్రేమిస్తూ హాయిగా జీవితాన్ని గడపడం బెటర్ అంటూ ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇతర దర్శకుల మాటేమిటో కానీ ఆర్జీవీ (RGV Dhanush )మాత్రం వెరీ వెరీ డిఫరెంట్. ఆయన అభిప్రాయాలు, ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి.
అవి సమాజాన్ని ఒకింత ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. దీంతో ఆర్జీవీతో పెట్టుకోవడం ఎందుకని మౌనంగా ఉంటారు. ఎందుకంటే ఆయనకు సినిమా మీద ఉన్న పట్టు ఇంకే దర్శకుడికి లేదంటే నమ్మలేం.
ఆయనే ఓ ఫ్యాక్టరీ. ముంబై సినీ రంగంలో ఓ ట్రెండ్ సెట్టర్ ఆర్జీవీ. తన శిష్యులు అద్భుతమైన సినిమాలు తీశారు. ప్రధానంగా మాఫియా , డాన్ ల సంస్కృతిని తెర కెక్కించడంలో సక్సెస్ అయ్యారు.
ఇదే సమయంలో ఆర్జీవీ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటంలో ఎక్స్ పర్ట్.
Also Read : విడి పోయిన ధనుష్ ఐశ్వర్య