INDvsSA 2nd ODI : ఊ అంటారా లేక‌ చేతులెత్తేస్తారా

నేడే భార‌త్ వ‌ర్సెస్ సౌతాఫ్రికా వ‌న్డే

INDvsSA 2nd ODI : స‌ఫారీతో టెస్టు సీరీస్ కోల్పోయి పేల‌వ‌మైన ఆట‌తీరుతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్ నాయ‌క‌త్వంలోని భార‌త జ‌ట్టు రెండో వ‌న్డే మ్యాచ్ (INDvsSA 2nd ODI )ఆడేందుకు సిద్దమైంది.

ఇప్ప‌టికే మొద‌టి వ‌న్డే 31 ప‌రుగుల తేడాతో ఓట‌మి మూట‌గట్టుకుంది. గ‌త ఏడాది కీవీస్ తో అటు వ‌న్డే ఇటు టెస్టు సీరీస్ నెగ్గి శుభారంభం అందించినా ఎందుక‌నో మ‌ళ్లీ మొద‌టి కొచ్చింది ఆట‌తీరు.

ప్ర‌ధానంగా మిడిల్ ఆర్డ‌ర్ గాడిన ప‌డ‌డం లేదు. ఒక‌రు బాగా ఆడితే మ‌రొక‌రు ఆడ‌డం లేదు. ప్ర‌ధానంగా స‌ఫారీ బౌల‌ర్ల‌ను ఎదుర్కొనేందుకు మ‌న ఆట‌గాళ్లు నానా తంటాలు ప‌డుతున్నారు.

నేరుగా వ‌చ్చే బంతుల్ని డిఫెన్స్ కూడా ఆడ‌లేక పోవ‌డం స‌గ‌టు భార‌తీయ ఫ్యాన్ ను విస్తు పోయేలా చేస్తోంది. వీరేనా మ‌నం స్టార్లుగా పిలుచుకుంటున్న‌ది అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

యూఏఈ వేదిక‌గా జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో దాయాది పాకిస్తాన్ తో భార‌త్ ఘోర‌మైన ఓట‌మిని చ‌వి చూసింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో ప‌రాజ‌యాన్ని ప‌రిసమాప్తం చేసింది.

ఏ కోశాన ధీటుగా బ‌దులు ఇవ్వ‌లేక పోయింది. ఆ త‌ర్వాత కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి టీమిండియాలో. సుదీర్ఘ కాలం పాటు సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌ట్టిన విరాట్ కోహ్లీ టీ20, వ‌న్డే, టెస్టు మ్యాచ్ ల‌కు గుడ్ బై చెప్పేశాడు.

అత‌డి స్థానంలో రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్ కు బీసీసీఐ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. మ‌రో వైపు ర‌విశాస్త్రి స్థానంలో రాహుల్ ద్ర‌విడ్ ను తీసుకు వ‌చ్చింది.

అయినా భార‌త ఆట తీరులో మార్పు క‌నిపించ‌డం లేదు. క‌నీసం ఇవాళ జ‌రిగే మ్యాచ్ లోనైనా టీమిండియా బోణీ కొట్టాల‌ని కోరుతున్నారు అభిమానులు.

Also Read : ఐర్లాండ్ పై ఇండియా అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!