Shobha Yatra : అంగ‌రంగ వైభ‌వం శోభ‌యాత్ర సంబురం

ఆధ్యాత్మిక క్షేత్రంగా శ్రీ‌రామ‌న‌గ‌రం

Shobha Yatra : ఎటు చూసినా భ‌క్తులే. ఎక్క‌డ చూసినా జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ నినాద‌మే. కాలం మారినా టెక్నాల‌జీ విస్త‌రించినా త‌మ‌లో ఇంకా భ‌క్తి ఛాయ‌లు పోలేద‌ని నిరూపించారు భ‌క్తులు.

శ్రీ‌రామ‌న‌గ‌రం ప్రాంగ‌ణంలో స‌మ‌తామూర్తి శ్రీ రామానుజాచార్యుల వెయ్యేళ్ల మ‌హోత్స‌వాలు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ప్రారంభం అయ్యాయి.

జ‌గ‌త్ గురువుగా ప‌ర‌మ ప‌విత్రంగా భావించే శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి వారి ఆధ్వ‌ర్యంలో స‌మతామూర్తి స‌మ‌తా కేంద్రం ప్రాంగ‌ణంలో మ‌హోత్స‌వం (Shobha Yatra)ప్రారంభ‌మైంది.

అంత‌కు ముందు భారీ ఎత్తున శ్రీ‌రామ‌న‌గ‌రం ప్రాంగ‌ణంలో శోభాయాత్ర(Shobha Yatra) నిర్వ‌హించారు. దారి పొడ‌వునా భ‌క్తులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన యాగ మండ‌పాల వ‌ర‌కు యాత్ర చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున భ‌క్తులు యాత్ర‌లో పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా కొంత సేపు ఉండి పోవాల్సి వ‌చ్చింది. భ‌క్తులు తాకిడి ఎక్కువ కావ‌డంతో చాలా సార్లు చిన‌జీయ‌ర్ స్వామి వారు భ‌క్తులు దారి ఇవ్వాల‌ని కోరాల్సి వ‌చ్చింది.

అంటే ఊహించ‌ని దాని కంటే భ‌క్తులు తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు. దారుల‌న్నీ శ్రీ‌రామ‌న‌గ‌రం ఆశ్ర‌మం వైపు ప‌రుగులు తీశాయి. ఎక్క‌డ చూసినా ఆధ్యాత్మిక శోభ సంత‌రించుకునేలా ఏర్పాట్లు చేశారు నిర్వాహ‌కులు.

యాగం వైశిష్ట్యం గురించి, ఈ మాన‌వ స‌మూహం ఎలా ఉండాల‌నే దాని గురించి సోదాహ‌ర‌ణంగా వివ‌రించారు శ్రీ దేవనాథ స్వామి. దేశం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన పీఠాధిప‌తులు, స్వాములు శ్రీ రామానుజుడి గురించి వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా వెయ్యేళ్ల త‌ర్వాత ఇలాంటి మ‌హాద్భుతాన్ని సృష్టించి ఆచ‌ర‌ణ‌లో చూపించిన మ‌హ‌నీయుడిగా శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి వారిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

Also Read : నాట‌కం నిషేధం హైకోర్టు ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!