Chinnajeeyar Swamy : రామానుజుడి మార్గం ప్రాతః స్మరణీయం
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి
Chinnajeeyar Swamy : అంతరాలు లేని సమాజం కావాలి. కుల, మతాలు, తరతమ భేదాలు లేని ప్రపంచం ఉండాలి. దానినే వెయ్యేళ్ల కిందటే కోరుకున్నారు. ఆచరణలో చేసి చూపించారు.
తరాలు మారినా టెక్నాలజీ విస్తరించినా ఎన్నో మార్పులు కలిగినా నేటికీ స్పూర్తి దాయకంగా నిలిచారు భగవద్ శ్రీ రామానుజాచార్యులు. మానవులంతా ఒక్కటే. సర్వ ప్రాణులు ఒక్కటేనని పిలుపునిచ్చారు ఆ మహనీయుడు.
ఆయన చూపిన మార్గం అత్యున్నతమైనది. ఆచరణీయమైనది. నిత్యం స్మరించు కోదగ్గది. అందుకే రామానుజుల వారిని ప్రాతః స్మరణీయులని అంటున్నాం.
మానవ జీవితం మరింత ఉత్కృష్టంగా మారాలంటే భక్తి అన్నది అలవర్చు కోవాలి. లేక పోతే జీవితం నిస్సారం అవుతుంది. తరతమ భేదాలను విస్మరించి సర్వ మానవ సేవయే పరమార్థం కావాలి.
అదే మహనీయుడు బోధించింది. దానిని నిన్నటి తరాలు స్వీకరించాయి. నేటి తరాలకు పాఠంగా ఉండాలని మేం ప్రయత్నం చేశాం.
రేపటి తరాలకు స్పూర్తి దాయకంగా, చిరస్మరణీయంగా పది కాలాల పాటు నిరంతరాయంగా సాగాలనే తాము శ్రీ రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి(Chinnajeeyar Swamy).
మనుషులంతా ఒక్కటేనన్న భావన ఆనాడే రూపుదిద్దు కోవడం మనందరి భాగ్యమని గుర్తించాలి. భక్తి మార్గమే మేలైనది. మన జీవన విధానాన్ని మరింత సులభతరం చేస్తుందన్నారు స్వామి వారు.
ఆ మహానుభావుడి జీవితం ఆదర్శ ప్రాయం. ఆ స్పూర్తిని నిరంతరాయంగా ఉండేలా చేసేందుకే విగ్రహాన్ని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు చిన్న జీయర్ స్వామి.
Also Read : సమతామూర్తి కేంద్రం ప్రశంసనీయం