Chinnajeeyar Swamy : భ‌క్తి మార్గం జీవ‌న సౌర‌భం

శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి

Chinnajeeyar Swamy : టెక్నాల‌జీ పెరుగుతోంది. కానీ భ‌క్తి భావ‌న త‌గ్గుతోంది. భ‌క్తి అన్న‌ది ఆచార్యుడో లేదా పండితుడో చెబితే, వారిని అనుస‌రిస్తే వ‌స్తుంది. ధ‌ర్మ‌బ‌ద్ద‌మైన జీవితం కావాలంటే భ‌క్తి అన్న‌ది నిత్యం మ‌నలో భాగ‌మై పోవాలి.

ప్ర‌స్తుత విద్యా విధానంలో లోపం క‌నిపిస్తోంది. ప్ర‌తి ఒక్క‌రూ ధ‌ర్మంగా, స‌మ‌త‌తో జీవించ‌డ‌మే కావాల్సి ఉంది. వెయ్యి ఏళ్ల కింద‌టే శ్రీ‌మ‌ద్ రామానుజులు స‌మ‌స్త మాన‌వాళికి స‌మ‌త‌తో జీవించేందుకు మార్గాన్నిక‌ల్పించారు.

ఆయ‌న అందించిన స్పూర్తిని ప్ర‌పంచానికి తెలియ చెప్పేందుకే ఇక్క‌డ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశాం. వేలాది మంది రుత్వికుల వేద పారాయ‌ణం అంద‌రి శాంతియుత జీవ‌నానికి దోహ‌దం చేస్తుంది.

క‌రోనా నివార‌ణ‌కు తోడ్ప‌డుతుంది. రామానుజుల స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాలు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో కొన‌సాగుతున్నాయి. వేదాలు, ఉప‌ష‌నిత్తుల సారాన్ని స‌మ‌స్త ప్ర‌జ‌లంద‌రికీ అందించాల‌న్న స‌త్ సంక‌ల్పాన్ని మ‌నంద‌రికీ అందించారు శ్రీ రామానుజుడు.

ఆనాడే మ‌హిళ‌ల‌కు వేద అధ్య‌యనం చేయించారు. ద‌ళితుల‌కు తిరు మంత్రాన్ని ఉప దేశించారు. వారికి కూడా ఆల‌య ప్ర‌వేశం ఉండాల‌ని నిన‌దించిన మ‌హ‌నీయుడు ఆయ‌న అని కొనియాడారు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి(Chinnajeeyar Swamy).

స‌మాజ ఉద్ద‌ర‌ణ‌కు ఏదైనా చేయాల‌న్న త‌ప‌నే ఇంత దాకా తీసుకు వ‌చ్చింది. తెలుగు నేల‌పై ఆయ‌న విగ్ర‌హానికి శ్రీ‌కారం చుట్టాం. ప‌దేళ్ల క‌ల వెయ్యేళ్ల త‌ర్వాత సాకార‌మైంది.

ఇది ఒక ర‌కంగా భార‌త దేశ ఆధ్యాత్మిక చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచి పోతుంది. దేశంలో ఎంద‌రో మ‌హానుభావులు ఉన్నారు. కానీ వారి గురించి నేటి త‌రానికి తెలియ‌కుండా పోవ‌డం బాధాక‌రం.

Also Read : రామానుజుడి మార్గం ప్రాతః స్మ‌ర‌ణీయం

Leave A Reply

Your Email Id will not be published!