Lata Mangeshkar Raj singh : అమ‌రం ప్రేమ క‌థా మ‌ధురం

ఆనాటి నుంచి లోకం వీడే దాకా

Lata Mangeshkar  : ప్రేమ రెండు గుండెల చ‌ప్పుడు. ఎన్నో ప్రేమ క‌థ‌లు. మ‌రెన్నో పాట‌లు. వాట‌న్నింటికీ ప్రాణం పోసింది మాత్రం గాయ‌నీ గాయ‌కులే. ఇవాళ చెప్పుకోవాల్సింది త‌న అమ‌ర‌త్వ‌పు గానంతో కోట్లాది గుండెల్ని మీటిన ఆ దైవ స్వ‌రూప‌మైన ల‌తా మంగేష్క‌ర్ గురించే.

చిన్న‌ప్పుడే తండ్రిని పోగుట్టుకున్న ల‌తాజీ 13 ఏళ్ల‌కే త‌న కెరీర్ స్టార్ట్ చేసింది. ఆనాటి నుంచి కుటుంబ బాధ్య‌త‌లు మోస్తూ వ‌చ్చింది. 

ఇదే స‌మ‌యంలో ల‌తాజీ( Lata Mangeshkar )చెల్లెలు ఆషా భోంస్లే వ్య‌వ‌హారం ఆమెను పెళ్లి ప‌ట్ల విముఖ‌త క‌లిగించేలా చేసింది.

ఎన్నో అద్భుత‌మైన పాట‌ల్ని ప్రేమ‌తో, హృద‌యం పెట్టి పాడి మ‌నల్ని, ముఖ్యంగా ప్రేమికుల్ని కంట త‌డి పెట్టించేలా చేసిన

 ల‌తా మంగేష్క‌ర్ సైతం ప్రేమ‌లో ప‌డిందంటే న‌మ్మ‌గ‌ల‌మా. పెళ్లి దాకా వ‌చ్చి ఆగి పోయింది.

త‌ను ఈ లోకాన్ని వీడే దాకా ఒంట‌రిగానే ఉన్నారు. దాతృత్వాన్ని చాటుకున్నారు. క‌ష్టాల్లో ఉన్న వారి కన్నీళ్ల‌ను తుడిచే ప్ర‌య‌త్నం చేశారు. 

కానీ ఆమె ఎంత గొప్ప గాయ‌కురాలో అంత కంటే ఎక్కువ దేశ‌భ‌క్తురాలు. అంతకు మించి ప్రేమికురాలు కూడా.

ఆమెకు ఓ క‌థ ఉంది. ఆ అనిర్విచ‌నీయ‌మైన ప్రేమ‌క‌థ‌లో క‌థానాయ‌కుడు క్రికెట‌ర్ రాజ్ సింగ్ దుంగార్పూర్. 

ఆ ప్ర‌మే ప్ర‌వాహంలో క‌దిలే న‌వోన్మిక‌గా ఉండి పోయింది ల‌తాజీ( Lata Mangeshkar ).

ఇద్ద‌రూ ఇప్పుడు లేరు. కానీ వారి ప్రేమ అజ‌రామ‌రంగా నిలిచే ఉంది. ఒక‌రు గాన కోకిల‌. 

ఇంకొక‌రు సంగీతాన్ని ఇష్ట‌ప‌డే ప్రేమికుడు. ల‌త‌కు క్రికెట్ అంటే ప్రాణం. రాజ్ సింగ్ కు పాట‌లే పంచ ప్రాణం.

దిగ్గ‌జ గాయ‌నిగా పేరు సంపాదించిన ఈ భార‌త ర‌త్న వృత్తి ప‌రంగా అత్యంత నిబ‌ద్ధ‌త‌తో, నిష్ట‌తో జీవ‌న ప్ర‌యాణం సాగించింది.

 అందుకేనేమో క‌భీ క‌భీ సినిమాలో క‌భీ క‌భీ మేరే దిల్ మే ఖ‌యాల్ ఆథా హై అని, గాతా ర‌హే మేరా దిల్ అని ఆక్రోశించింది.

రాజ్ సింగ్ దుర్గార్ పూర‌ర్ ను సంగీతం ప‌ట్ల ఉన్న మ‌మ‌కారం ల‌త‌తో ద‌గ్గ‌ర‌య్యేలా చేసింది. 

ఒక‌రు క్రికెట‌ర్ మ‌రొక‌రు సింగ‌ర్ ఒకే భావంతో ఉండ‌డం, ఆలోచ‌ల్ని పంచుకునేలా మార్చేసింది.

ఆ స్వ‌ర మాధుర్యం అత‌డిని పిచ్చి వాడిని చేసింది. అత‌డికి క్రికెట్ ఆట ప‌ట్ల ఉన్న మ‌క్కువ ల‌తా దీదీని మెస్మ‌రైజ్ చేసింది. 

ల‌తా సోద‌రుడు కూడా క్రికెట్ ఆడేవాడు..రాజ్ సింగ్ కూడా ఇద్ద‌రూ క‌లిసి ఇంటికి రావ‌డం పోవ‌డం మొద‌లైంది.

ల‌తతో స్నేహం మొద‌లైంది. ఆ త‌ర్వాత ప్రేమ‌గా మారింది. రాజేత‌ర కుటుంబం కావ‌డంతో రాజ్ సింగ్ పేరెంట్స్ ఒప్పుకోలేదు. 

దీంతో ఆనాటి నుంచి చ‌ని పోయేంత దాకా వారి మ‌ధ్య బంధం అలాగే ఉంది.

కానీ ఒంట‌రిగానే ఉండి పోయింది ల‌తా. త‌న‌కంటే ముందే రాజ్ సింగ్ చ‌ని పోయిన‌ప్పుడు ల‌తా వెళ్లింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ల‌తాను రాజ్ సింగ్ మిథూ అని పిలుచుకునే వార‌ని రాజ‌శ్రీ ఆత్మ‌క‌థ‌లో రాశారు. ఏది ఏమైనా ప్రేమ అజ‌రామ‌రం. అనంతం.

Also Read : గాత్ర మాధుర్యం అజ‌రామ‌రం

Leave A Reply

Your Email Id will not be published!