Lata Mangeshkar : గాత్ర మాధుర్యం అజ‌రామ‌రం

ఇక సెల‌వంటూ వెళ్లి పోయిన ల‌త

Lata Mangeshkar : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన సినీ దిగ్గ‌జం ల‌తా మంగేష్క‌ర్ ఇక సెల‌వంటూ వెళ్లి పోయింది. 92 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన ఆమె ఇక లేర‌న్న వార్త‌ను దేశం జీర్ణించు కోలేక పోతోంది.

ల‌తా మంగేష్క‌ర్ ఎన్నో అవార్డులు, పుర‌స్కారాల‌ను అందుకున్నారు.

దేశం గ‌ర్వించ ద‌గిన భార‌త ర‌త్న‌, ప‌ద్మ విభూష‌ణ్, ప‌ద్మ భూష‌ణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు.

20 భాష‌ల‌లో 50 వేల‌కు పైగా పాట‌లు పాడారు. భార‌తీయ సినీ రంగానికి ఆమె ఓ ఐకాన్ గా నిలిచారు.

మ‌రాఠీతో ప్రారంభ‌మైన ల‌తా మంగేష్క‌ర్ గానామృతం నేటి దాకా కొన‌సాగుతూనే వ‌చ్చింది.

ప్ర‌ముఖ సంగీత కుటుంబానికి చెందిన ల‌తా దీదీ స్వ‌ర మాధుర్యాన్ని అందించ‌డ‌మే కాదు కొన్ని చిత్రాల‌ను సైతం నిర్మించారు.

ఆమె నైటింగేల్ ఆఫ్ ఇండియా – భార‌తీయ గాన కోకిల‌గా ప్ర‌సిద్ది చెందింది.

ఆ స్వ‌రం మూగ పోవ‌డం దేశానికి తీర‌ని న‌ష్టం అని పేర్కొన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.

ఇదిలా ఉండ‌గా ల‌తా మంగేష్క‌ర్(Lata Mangeshkar) 1929లో పుట్టారు. ఐదుగురు తోబుట్టువుల‌లో పెద్ద‌వారు.

వారిలో గాయ‌ని ఆశా భోంస్లే కూడా ఒక‌రు. ఆమె తండ్రి శాస్త్రీయ సంగీత విధ్వాంసుడు పండిట్ దీనా నాథ్ మంగేష్క‌ర్.

లతాకు చిన్న‌ప్పుడే మొద‌టి సంగీత పాఠాన్ని నేర్పించారు.

1942లో త‌న తండ్రి మ‌ర‌ణించిన‌ప్పుడు ఆమెకు 13 ఏళ్లు. అప్పుడే మ‌రాఠీ చిత్రాల‌లో న‌ట‌నా భాగాల‌తో గార‌డీ చేస్తూ సంగీతంలో త‌న కెరీర్ ప్రారంభించారు.

1945లో మ‌ధుబాల న‌టించిన మ‌హ‌ల్ చిత్రంలోని ఆయేగా ఆనే వాలా పాట ల‌తా మంగేష్క‌ర్(Lata Mangeshkar) కు పేరు తీసుకు వ‌చ్చింది.

అక్క‌డి నుంచి ల‌తా మంగేష్క‌ర్ గాత్రం, కెరీర్ ఊహించ‌ని ఎత్తుకు చేరింది.

ఆమె బైజు బావ్రా, మ‌ద‌ర్ ఇండియా, మొఘ‌ల్ – ఏ – ఆజం, బ‌ర్సాత్, శ్రీ 420 లో అద్భుత‌మైన పాట‌లు పాడారు.

అంతే కాదు క‌భీ క‌భీ మూవీలో ఆమె పాడిన సాంగ్స్ ఎవ‌ర్ గ్రీన్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ల‌తా మంగేష్క‌ర్ 50 వేల‌కు పైగా పాట‌లు పాడారు. 70 శతాబ్దాలుగా త‌న గానామృతాన్ని పంచారు ఈ దేశానికి.

నౌషాద్ రాసిన రాగ – ఆధారిత కంపోజిష‌న్ ను పాడింది.

మ‌ధుమ‌తిలో స‌లీల్ చౌద‌రి అందించిన పాట‌లు ఉత్త‌మ నేప‌థ్య గాయ‌నిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు తెచ్చి పెట్టాయి.

బిస్ సాల్ బాద్, ఖండ‌న్ , జీనే కీ రాహే ద్వారా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు ద‌క్కాయి.

ల‌తా దీదీ ప‌రిచ‌య్ , కోరా కాగ‌జ్ , లేకిన్ చిత్రాల‌కు ఉత్త‌మ నేప‌థ్య గాయ‌నిగా మూడు జాతీయ అవార్డుల‌ను గెలుచుకున్నారు.

పాకీజా, అభిమాన్ , అమ‌ర్ ప్రేమ్ , ఆంధీ, సిల్ సిలా , చాందినీ, సాగ‌ర్, రుడాలి,

దిల్ వాలే దుల్హ‌నియా లే జాయెంగే, మైనే ప్యార్ కియా..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుత‌మైన పాట‌లు పాడారు

ల‌తా మంగేష్క‌ర్. ల‌తాజీ పాడిన అత్యంత ప్రసిద్ద‌మైన దేశ‌భ‌క్తి పాట‌ల‌లో జ‌వాన్ల కోసం ఆమె పాడిన ఏ మేరే వ‌త‌న్ కో లోగో పాట గొప్ప‌ది.

1962లో చైనాతో జ‌రిగిన యుద్ధంలో మ‌ర‌ణించిన సైనికుల‌ను స్మ‌రించుకుంటూ పాడారు.

1963లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా న్యూఢిల్లీలోని నేష‌న‌ల్ స్టేడియంలో ప్ర‌ద‌ర్శించారు.

కొన్ని చిత్రాలు నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు అందుకున్నారు.

ఆనాటి దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుల నుంచి నేటి ఏఆర్ రెహ‌మాన్ దాకా పాడారు.

ల‌తాజీని కోల్పోవ‌డం సినీ రంగానికే కాదు దేశానికి తీర‌ని న‌ష్టం.

Also Read : అరుదైన జ్ఞాప‌కం చిర‌స్మ‌ర‌ణీయం

Leave A Reply

Your Email Id will not be published!