Che Guevara India : అరుదైన జ్ఞాప‌కం చిర‌స్మ‌ర‌ణీయం

1959లో చేగువేరాకు అన్న‌దాత స్వాగ‌తం

Che Guevara India :  గ‌తం అర్థం చేసుకోక పోతే భ‌విష్య‌త్తు అర్థం కాదు. ఇది ప్ర‌తి దేశానికీ వ‌ర్తిస్తుంది. కాల గ‌మ‌నంలో ఎంద‌రో వీరులు ఈ లోకంలో జ‌న్మించారు. మ‌రికొంద‌రు కోట్లాది ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేశారు.

స్వేచ్ఛ కంటే త‌న ప్రాణం ముఖ్యం కాద‌ని చాటిన వాడు. దీరోదాత్తుడు చేగువేరాChe Guevara India).

ఆయ‌న ఇవాళ భౌతికంగా లేక పోయినా ఇప్ప‌టికీ కొన్ని త‌రాల‌ను ప్ర‌భావితం చేస్తూనే ఉన్నాడు.

కోట్లాది మంది అత‌డిని స్పూర్తిగా తీసుకుని గ‌డుపుతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. ఈ యుద్దవీరుడు భార‌త దేశానికి కూడా వ‌చ్చాడు.

ఇదిలా ఉండ‌గా ఇండియ‌న్ హిస్ట‌రీస్ పేరుతో అరుదైన సంఘ‌ట‌న‌లు, ఘ‌ట‌న‌లు, చ‌రిత్ర‌కు సంబంధించిన అరుదైన ఫోటోల‌ను దేశానికి షేర్ చేస్తూ వ‌స్తోంది.

మ‌న చ‌రిత్ర‌ను మ‌నం మ‌రిచి పోకుండా ఉండేందుకని. ఇక సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ దేశ చ‌రిత్ర‌లో రైతులు ఏడాదికి పైగా పోరాడిన దాఖ‌లాలు లేవు.

అది కూడా చ‌రిత్రే. ఇదిలా ఉండ‌గా చేగువేరా 1959లో ఇండియాకు వ‌చ్చిన సంద‌ర్భంగా ఓ రైతు ఆయ‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది

. చెర‌గ‌ని చిరున‌వ్వే కాదు బ‌తుకంతా దేశం కోసం, స‌మ‌స్త ప్ర‌జానీకం కోసం పోరాడిన యోధుడు చేగువేరా. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ప్ర‌పంచ‌మంతా ఆయ‌న‌ను -చే-గా పిలుచుకుంటారు.

ఆరాధిస్తారు. ప్రేమిస్తారు. అంత‌లా ఆయ‌న ప్ర‌భావితం చేశారు. చేస్తూనే ఉంటారు కూడా.

మండే సూర్యుడిగా పేరొందిన నెల్స‌న్ మండేలా చేగువేరాను స్వేచ్ఛ‌ను ప్రేమించే ప్ర‌తి మాన‌వునికీ ప్రోత్సాహం క‌లిగిస్తూనే ఉంటాడ‌ని అభివ‌ర్ణించారు.

ఇక ప్ర‌పంచంలోనే త‌త్వ‌వేత్త‌గా, మేధావిగా పేర్కొనే జీన్ పాల్ సార్త్రే ఓ సంద‌ర్భంలో చేను ఆకాశానికి ఎత్తేశాడు.

చేగువేరా (Che Guevara India)మేధావి మాత్ర‌మే కాదు మ‌న కాలానికి చెందిన పరిపూర్ణ‌మైన మాన‌వుడు అని పేర్కొన్నాడు.

ఎంద‌రో ర‌చ‌యిత‌లు ఆయ‌న‌కు కితాబు ఇచ్చారు. ల‌క్ష్యం మాన‌వ‌త్వం కంటే త‌క్కువ‌ది మేరేదీ కాద‌న్నాడు చేను ఉద్ధేశించి సుసాన్ సొంటాగ్.

ఫ‌నోన్ అయితే ఒక మ‌నిషిలో ఉండ‌గల అన్ని ల‌క్ష‌ణాల‌ను ప్రోది చేసిన ప్ర‌పంచ ప్ర‌తీక అని పేర్కొన్నాడు.

బ్లాక్ పాస్ట‌ర్ పార్టీ చీఫ్ కార్మి చెల్ అయితే చేగువేరా(Che Guevara India) మ‌ర‌ణించ‌లేదు. అత‌డి ఆలోచ‌న‌లు ఇంకా మ‌న‌తో పాటే ఉన్నాయి.

క్యూబాలో ఇప్ప‌టికీ త‌మ జాతీయ నాయ‌కుడిగా ప్రేమిస్తారు. తిరుగుబాటుకు ఆయ‌నను ప్ర‌తీక‌గా భావిస్తారు.

Also Read : త్రివ‌ర్ణ‌ ప‌తాక‌మా జ‌య‌హో యువ భార‌త‌మా

Leave A Reply

Your Email Id will not be published!