Lata Mangeshkar : ల‌తా మ‌ర‌ణం దేశానికి తీర‌ని విషాదం

క‌న్నీటి ప‌ర్యంత‌మైన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

Lata Mangeshkar  : భార‌త దేశ సినీ దిగ్గ‌జ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ లేర‌న్న వార్త‌ను తాను జీర్ణించు కోలేక పోతున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. నేను ల‌తా దీదీ లేర‌న్న వార్త‌ను త‌ట్టుకోలేక పోతున్నాన‌ని పేర్కొన్నారు.

ద‌య‌, శ్ర‌ద్ధ గ‌ల ల‌తా మంగేష్క‌ర్ దీదీ మ‌మ్మ‌ల్ని విడిచి వెళ్లి పోయారు. ల‌తాజీ ( Lata Mangeshkar )మ‌న దేశంలో పూరించ లేని శూన్యాన్ని, అంత‌కంటే క‌న్నీళ్ల‌ను మిగిల్చింద‌ని వాపోయారు ప్ర‌ధాని.

నేటి త‌ర‌మే కాదు రాబోయే త‌రాలు సైతం ల‌తా మంగేష్క‌ర్ ను క‌లకాలం గుర్తుంచు కుంటాయ‌ని కొనియాడారు. నా హృద‌యం విషాదంతో అలుముకుంది.

ఆమె మ‌ర‌ణం దేశానికి ఈ లోకానికి తీర‌ని లోటుగా పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి. భార‌తీయ సంస్కృతికి, ప్ర‌ధానంగా సినీ రంగానికి ఇది క‌న్నీళ్ల‌ను మిగిల్చింది.

ల‌తా మంగేష్క‌ర్ ( Lata Mangeshkar )మ‌ధుర‌మైన స్వ‌రం ప్ర‌జ‌ల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేయ‌గ‌ల అస‌మాన‌మైన సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉంది. ఉంటూనే ఉంద‌న్నారు న‌రేంద్ర మోదీ. నేను మ‌నిషిని కాలేక పోతున్నాను.

ల‌తాజీ ఈ దేశం గ‌ర్వించ ద‌గిన మ‌హోన్న‌త‌మైన గాయ‌క దిగ్గ‌జం. క‌రోనా మ‌హ‌మ్మారి మొన్న‌టికి మొన్న బాల‌సుబ్ర‌మ‌ణ్యంను తీసుకు వెళ్లింది. కానీ ఇప్పుడు తాను ఆరాధించే ల‌తా మంగేష్క‌ర్ ను కోల్పోవ‌డాన్ని జీర్ణించు కోలేక పోతున్నాను.

దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్ర‌క‌టించిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. ఆమెకు ఈ దేశం విన‌మ్రంగా నివాళి అర్పిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. లతాజీ ఎక్క‌డ ఉన్నా ఆత్మకు శాంతి చేకూరాల‌ని కోరారు ప్ర‌ధాని.

Also Read : పుదుచ్చేరి సీఎం త‌ల‌ప‌తి విజ‌య్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!