Arif Khan : ఆరిఫ్ ఖాన్ మెలోడీ పాటలకు పెట్టింది పేరు. లాహోర్ లో పుట్టాడు. తండ్రి సివిల్ సర్వెంట్. మాస్టర్స్ చేశాడు. లండన్ లో ఉన్నత విద్య అభ్యసించాడు. అక్కడే స్థిర పడ్డాడు.
ఎంబీయే చేసిన ఆరిఫ్ ఖాన్(Arif Khan )టాప్ లో నిలిచాడు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు తనకు ఇష్టమైన సంగీతం పట్ల మక్కువతో పాటలు పాడడం స్టార్ట్ చేశాడు.
అతడి స్వరంలో సమ్మిళితమైన భావోద్వేగం మనల్ని కట్టి పడేస్తుంది. ముఖేష్ అంటే అతడికి వల్లమాలిన అభిమానం. నిరంతరం పాడటంలో ఉన్నంత ఆనందం ఇంకెందులోనూ ఉండదంటాడు ఆరిఫ్ ఖాన్.
అతడిలోని గాత్ర మాధుర్యాన్ని గుర్తించిన బంధువులు, స్నేహితులు ఆరిఫ్ ను పాడటంపై మక్కువ పెట్టాలని కోరారు. దీంతో మెల మెల్లగా తన గొంతుకు పదును పెట్టాడు. అహోరాత్రులు శ్రమించాడు.
పలు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చాడు. టీవీ షోస్ లో పాల్గొన్నాడు. తన గానామృతాన్ని పంచాడు. ఆరిఫ్ ఖాన్(Arif Khan )తనకు ఇష్టమైన భారతీయ గాయకుడు ముఖేష్ కోసం ప్రత్యేకంగా ముఖేష్ కీ యాద్ మే పేరుతో పాటల ఆల్బమ్ విడుదల చేశాడు.
2009 లో దీనిని రిలీజ్ చేసిన కొద్ది రోజుల్లోనే టాప్ లో చేరింది. ముఖేష్ లోని ఆ గాంభీర్యాన్ని ఎక్కడా తగ్గకుండా ఆరిఫ్ ప్రయత్నిస్తూ వచ్చాడు. సక్సెస్ అయ్యాడు.
సంగీతం ఎల్లలు లేని ప్రపంచం. దానికి కుల, మతాలు, వర్గ విభేదాలు అంటూ ఉండవని నిరూపించాడు ఆరిఫ్ ఖాన్. వీలైతే అతడు ఆర్ద్రతతో పాడిన ముఖేష్ ఆలాపించిన కభీ కభీ మేరె దిల్ మే ఖయాల్ ఆథాహై పాట వినండి.
మనమూ అతడి గాత్ర ప్రవాహంలో కొట్టుకు పోకుండా ఉండలేం.
Also Read : సినిమాలకు రాహుల్ రామకృష్ణ గుడ్ బై