Chinnajeeyar Swamy : రామానుజుడి మార్గం శిరోధార్యం

శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న‌జీయ‌ర్ స్వామి

Chinnajeeyar Swamy : స‌మ‌త‌ను బోధించారు. స‌మాన‌త కోసం ఆక్రోశించారు. కుల‌, మ‌తాలు, వ‌ర్గ‌, విభేదాలు ఉండ కూడద‌ని బోధించాడు శ్రీ భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యులు. పండితుల‌కే ఎందుకు పామ‌రుల‌కు ఆల‌య ప్ర‌వేశం ఉండ‌కూడ‌ద‌ని ప్ర‌శ్నించాడు

.వెయ్యేళ్ల కింద‌ట ఈ భువిపై న‌డ‌యాడిన మ‌హోన్న‌త మాన‌వుడు శ్రీ రామానుజుడు. ఆయ‌న చూపిన మార్గం అత్యంత అవ‌స‌రం..అనుస‌ర‌ణీయం కూడా.

ఆ స‌మ‌తామూర్తి స్పూర్తి ఏళ్లు గ‌డిచినా త‌రాలు గ‌డిచినా టెక్నాల‌జీ విస్త‌రించినా అలాగే కొన‌సాగుతూ వ‌స్తున్న‌ది. ఇదే స‌త్యం. ఇదే వాస్త‌వం.

ఇదే జీవిత సారం కూడా. స‌ర్వ ప్రాణుల‌న్నీ స‌మాన‌మేన‌ని , స‌మ‌స్త మాన‌వులంతా ఒక్క‌టేన‌ని పండితుల‌కే కాదు పామ‌రుల‌కు కూడా దైవం ఒక్క‌టేన‌ని, వారికి కూడా ఆలయ ప్రవేశం ఉండాల‌ని ప‌రిత‌పించాడు.

గురువు త‌న‌కు ఉప‌దేశించిన మూల మంత్రాన్ని అంద‌రికీ వినిపించాడు. వారి కోసం తాను న‌ర‌కానికి వెళ్లినా ప‌ర్వాలేద‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌చాడు శ్రీ‌రామానుజుడు. ఎంద‌రో మ‌హానుభావులు ఈ ప‌విత్ర భూమి మీద జ‌న్మించారు.

చాలా మంది గురించి మ‌న‌కు తెలియ‌దు. అలాంటి గొప్ప‌వాళ్ల గురించి తెలుసు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు జ‌గత్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి(Chinnajeeyar Swamy).

రామానుజుడు చూపిన మార్గాన్ని రాబోయే త‌రాల‌కు అందించాల‌నే స‌దుద్దేశంతోనే స‌మ‌తా కేంద్రంలో విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశామ‌న్నారు.

దీనిని ద‌ర్శించు కోవ‌డం అంటే భ‌గ‌వ‌త్ అనుగ్ర‌హం ఉండ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. నేటికీ చిర‌స్మ‌ర‌ణీయంగా ఉండేలా తీర్చిదిద్ద‌డం జ‌రిగింద‌న్నారు. జీవిత ప్ర‌యాణంలో రామానుజుడు ఏం చేశాడు అన్న‌ది ముఖ్యం.

దానిని భ‌క్త బాంధ‌వులు తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు చిన్న జీయ‌ర్ స్వామి.

Also Read : మోదీ ‘చైనా నిర్బ‌ర్ భార‌త్’

Leave A Reply

Your Email Id will not be published!