Statue Of Equality : దేశమంతా ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహం వైపు చూస్తోంది. అసలు విగ్రహాలు ఎందుకు పెడతారు అన్న ప్రశ్న ఉదయించక మానదు.
మహానుభావులు ఈ జాతికి, ఈ పవిత్ర భూమికి చేసిన సేవలకు గుర్తింపుగా ఏర్పాటు చేసుకుంటారు. వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతుంది.
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి జగత్ గురువుగా ప్రసిద్ది చెందారు.
ఆయన ఆధ్వర్యంలో శ్రీరామనగరం ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది 100 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది.
ఓ వైపు కాశ్మీర్ టు కన్యాకుమారిని కలిపే జాతీయ రహదారి. ఇంకో వైపు అంతర్జాతీయ విమానాశ్రయం.
మధ్యలో ఈ సమతా కేంద్రం(Statue Of Equality). దీనిని ఏర్పాటు చేయాలన్న స్వామికి పది ఏళ్ల కిందట కలిగింది.
ప్రస్తుతం ఈ విగ్రహం 216 అడుగులు కలిగి ఉన్నది. దేశంలోనే ఇది ప్రథమం.
బ్యాంకాక్ లో బుద్దుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాని అడుగులు 316. చైనాకు చెందిన కంపెనీ దీనిని తయారు చేసింది.
రూ. 1000 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 60 మంది నిపుణులు ఈ విగ్రహ నిర్మాణంలో పాల్గొన్నారు.
2, 700 మంది శిల్పులు ఇక్కడ పని చేశారు.
108 దివ్య దేశాలు ఉన్నాయి. విగ్రహం చుట్టూ స్తంభాలు, శిల్ప కళా నైపుణ్యం ఇక్కడ కొలువై ఉంది.
రాజస్థాన్ నుంచి 4 లక్షల క్యూబిక్ అడుగుల గులాబీ ఇసుక రాయిని తీసుకు వచ్చారు.
తోరణాలు, టికెట్ కౌంటర్లు, ఇతర నిర్మాణాల కోసం ఉపయోగించారు. కోటప్పకొండ,
ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 5 లక్షల క్యూబిక్ అడగుల నల్ల ముత్యాల గ్రానైట్ – కృష్ణ శిలను దివ్య దేశాల నిర్మాణం కోసం వాడారు.
468 స్తంభాల కోసం రాజస్థాన్ నుంచి 75 వేల క్యూబిక్ అడుగుల బ్లాక్ మార్బుల్స్ ను ఉపయోగించారు.
ఇసుక రాతి శిల్పాలలో నైపుణ్యం కలిగిన మౌంట్ అబు నుంచి ప్రత్యేక శిల్పులు ఇక్కడ పని చేశారు.
ఆళ్లగడ్డ, శ్రీరంగం, మధురై, తిరుపతి, మహాబలిపురం, ఇతర ప్రాంతాల నుంచి శిల్పులు
ఈ సమతాకేంద్రం (Statue Of Equality)నిర్మాణంలో పాలు పంచుకున్నారు. 325 విగ్రహాలను చెక్కేందుకు కృష్ణ శిల రూపాన్ని ఉపయోగించారు.
కాంచీపురం లోని వాలజ్య నుంచి సేకరించారు. అనేక సాలిగ్రామాలు – విష్ణువుకు సంబంధించిన పవిత్ర రాళ్లు నేపాల్ లోని గండకి నంది నుంచి సేకరించారు.
ప్రస్తుతం ఉన్న ఆలయాల్లో సాలిగ్రామాలకు నిర్వహించే అన్ని పూజలు, ఆచారాలను 108 దివ్య దేశాలలో ఉపయోగిస్తున్నారు.
దేశమంతటా కొలువై ఉన్న వాటిని దర్శించు కోలేని భక్తులు ఇక్కడ ఒకే చోట దర్శించుకునే భాగ్యాన్ని కల్పించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి.
గర్భగుడి, గోపురాలు, కలశాలు , ప్రధాన విగ్రహానికి ప్రతిరూపంగా నిర్మించారు. నిత్యం వేదమంత్రోశ్చారణలు కొనసాగుతూనే ఉంటాయి.
అష్టాక్షరీ మహా మంత్రం ధ్వనిస్తూనే ఉన్నది. ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాల పఠనం కొనసాగుతోంది.
మహా ప్రసాదం 24 గంటల పాటు భక్తులకు అందించే భాగ్యాన్ని కలిగించారు స్వామి.
Also Read : ఆగని పోరాటం ఆపని ఉక్కుపాదం