Raj Nath Singh : శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో కొనసాగుతున్న సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కొనసాగుతున్నాయి.
దేశం నలుమూలల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే సమతా కేంద్రం ప్రాంగణం భక్తజనంతో నిండి పోయింది. ఇక వీవీఐపీలు శ్రీరామనగరం ఆశ్రమానికి క్యూ కట్టారు.
దేశం యావత్ ఇప్పుడు ఈ ఉత్సవ మూర్తి వైపు చూస్తోంది. 216 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్ లు దర్శించుకున్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. స్వామి వారి ఆశీర్వచనం తీసుకున్నారు.
తాజాగా ఇవాళ రాజ్ నాథ్ సింగ్(Raj Nath Singh ) రానున్నారు. యాగంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుంటారు. రక్షణ మంత్రి రాకతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇక శ్రీరామనగరంలో యజ్ఞాలు, అష్టాక్షరీ మంత్ర పఠనాలు, చతుర్వేద పారాయాణలతో వెయ్యేళ్ల పండుగ కొనసాగుతోంది. ఇవాళ 9వ రోజు. ఉత్సవాలలో భాగంగా అష్టాక్షరీ మహా మంత్ర అనుష్టాన కార్యక్రమం జరుగుతోంది.
ఆరాధన భగవత్ సన్నిధానంలో కొనసాగింది. శ్రీ పెరుమాళ్ స్వామికి ప్రాతః కాల ఆరాధాన చేపట్టారు. శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం పూర్తయింది.
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో 108 దివ్య దేశాల్లోని 20 దేవాలయాలలో కుంభాషేకం, మహా సంప్రోక్షణ కొనసాగుతోంది.
Also Read : శ్రీరామనగరం రామానుజ మంత్రం