IPL 2022 Auction : ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ వేలం 2022 ప్రారంభమైంది. భారీ ధర పలుకుతాడని అనుకున్న శ్రేయాస్ అయ్యర్ ఊహించని రీతిలో రూ. 12.25 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ చేజిక్కించుకుంది.
శిఖర్ ధావన్ , కగిసో రబాడా పంజాబ్ కింగ్స్ తీసుకుంది. ఇక గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్(IPL 2022 Auction )తరపున ఆడి, అనూహ్యంగా ఆ జట్టు నుంచి తొలగించ బడిన ఆసిస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ను ఢిల్లీ తీసుకుంది.
భారీ ధర పలుకుతాడని అనుకున్నా రూ. 6.25 కోట్లకు తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. శిఖర్ ధావన్ , కగిసో రబాడా లను పంజాబ్ కింగ్స్ వరుసగా రూ. 8.25 కోట్లకు, రూ. 9.25 కోట్లకు తీసుకుంది.
ఇక శ్రేయస్ అయ్యర్ భారీగా ధర వస్తుందని అనుకున్నారు. కానీ అనుకున్న ధర రాలేదు. ఈసారి ఐపీఎల్ (IPL 2022 Auction )వేలం పాటలో రెండు కొత్త జట్లు పాల్గొన్నాయి. గుజరాత్ టైటాన్స్ , లక్నో సూర్ జెయింట్స్ . ఇప్పటి వరకు ఉన్న ఎనిమిది జట్లు కూడా ఇందులో పాల్గొన్నాయి.
వాటిలో ముంబై ఇండియన్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ , చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ , ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి.
ఇవాళ ప్రారంభమైన వేలం పాటలో కోచ్ లు, సహాయక సిబ్బంది, స్కౌట్స్ , కొంత మంది కెప్టెన్లు కూడా పాల్గొన్నారు. ఈసారి వార్నర్ ను రాజస్తాన్ రాయల్స్ తీసుకుంటుందని భావించారు. కానీ ఊహించని రీతిలో ఢిల్లీ తీసుకుంది.
Also Read : క్లీన్ స్విప్ చేస్తారా చేతులెత్తేస్తారా