IPL 2022 Auction : ప్రపంచం యావత్తు ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ 2022 (IPL 2022 Auction )వేలం ప్రారంభమైంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. బెంగళూరు వేదికగా ఐసీసీ, బీసీసీఐ ఐపీఎల్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది.
ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు వేలం పాటలోకి వచ్చారు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ దుమ్ము రేపుతోంది. ఇప్పటికే నలుగురు స్టార్లను తీసుకుంది. దేవదత్ పడిక్కల్ ను రూ. 7.75 కోట్లకు చేజిక్కించుకుంది.
హిట్మైర్ ను 8.5 కోట్లకు , రవిచంద్రన్ అశ్విన్ ను రూ. 5 కోట్లకు, ట్రెండ్ బౌల్ట్ ను రూ. 8 కోట్లకు కైవసం చేసుకుంది. ప్రస్తుతం హర్షల్ పటేల్ కోసం వేలం పాట పాడుతోంది రాజస్థాన్ రాయల్స్ .ఇప్పటికే సంజూ శాంసన్ ను స్కిప్పర్ గా పెట్టుకుంది.
కన్సల్టంట్ గా సంగక్కరను తీసుకుంది. డుప్లెసిస్ ను ఆర్సీబీ రూ. 7 కోట్లకు తీసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ డికాక్ ను రూ. 675 కోట్లకు తీసుకుంది. డికాక్ ను లక్నో సూపర్ జెయింట్్ ను రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది.
గత ఏడాది 8 ఫ్రాంచైజీలు వేలం పాటలో పాల్గొనగా ఈసారి రెండు కొత్త జట్లతో మొత్తం 10 జట్ల ఫ్రాంచైజీలు వేలం పాటలో (IPL 2022 Auction )పాల్గొన్నాయి. శిఖర్ ధావన్ ను పంజాబ్ కింగ్స్ ను రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది.
భారత స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ ను రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. మరో స్టార్ పేసర్ మహమ్మద్ షమీని గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
ఇదిలా ఉండగా ఈ వేలం పాటలో 590 మంది ఆటగాళ్లు రానున్నారు.
Also Read : శ్రేయస్ కోల్ కతా పరం వార్నర్ ఢిల్లీ వశం