Statue Of Equality : స‌మ‌తా కేంద్రం భ‌గ‌వ‌న్నామ స్మ‌ర‌ణం

ఆధ్యాత్మిక సౌరభం శ్రీ‌రామ‌న‌గ‌రం

Statue Of Equality  : ముచ్చింత‌ల్ లోని శ్రీ‌రామ‌న‌గ‌రం ఆధ్యాత్మిక సౌరభంతో వెలుగుతోంది. ఎటు చూసినా భ‌క్తుల సంద‌డి నెల‌కొంది. జై శ్రీ‌రామ‌న్నారాయ‌ణ మంత్రం జ‌పిస్తూ యాగ‌శాల‌లో పాల్గొంటున్నారు.

రూ. 1000 కోట్ల ఖ‌ర్చుతో 216 అడుగులతో ఏర్పాటు చేసిన శ్రీ భ‌గ‌వ‌ద్ రామానుజుడి స‌మ‌తామూర్తి(Statue Of Equality )విగ్ర‌హాన్ని ద‌ర్శించుకునేందుకు భారీ ఎత్తున పోటీ ప‌డుతున్నారు.

స‌హస్రాబ్ది ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఈనెల 14 వ‌ర‌కు కొన‌సాగనున్నాయి. మొత్తం 13 రోజుల పాటు ఉండేలా శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి వారు ప్లాన్ చేశారు.

ఆ మేర‌కు ఇప్ప‌టి దాకా 12 రోజులు పూర్త‌య్యాయి. 108 దివ్య దేశాల ప్ర‌తిష్టాప‌న‌, ప్రారంభోత్స‌వం కొన‌సాగుతోంది. ప్ర‌ముఖుల ప్ర‌వ‌చ‌నాలు, ప్ర‌సంగాలు కొన‌సాగుతున్నాయి.

దేశం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన 5 వేల మంది రుత్వికులు, పండితులు, పీఠాధిప‌తులు, యోగులు, స్వాములు పూజా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటున్నారు.

ఇదిలా ఉండ‌గా ఢిల్లీ నుంచి మ‌ధ్యాహ్నం ఇక్క‌డికి రానున్నారు రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్. రెండు గంట‌ల‌కు పైగా పాల్గొంటారు. ఇవాళ 120 కేజీల‌తో త‌యారు చేసిన స్వ‌ర్ణ‌మూర్తి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు.

ఇవాళ 19 దివ్య దేశ ఆల‌యాల‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేస్తారు. ఇవాల్టి యాగంలో విశ్వ‌క్సేన ఇష్టి, శ్రీ‌మ‌న్నారాయ‌ణ ఇష్టి, పెరుమాల్ కు పుష్పార్చ‌న కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయి.

రామానుజుడు వెయ్యేళ్ల కింద‌టే కుల‌, మ‌తాలు, వ‌ర్గ‌, విభేదాలు ఉండ కూడ‌ద‌ని బోధించాడు. ప్ర‌తి ఒక్క‌రికీ దైవ ద‌ర్శ‌నం ఉండాల‌ని కోరాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక విప్ల‌వకారుడిగా(Statue Of Equality )పేరొందారు.

ఆ స్పూర్తిని కొనసాగించేందుకే ఇక్క‌డ స‌మ‌తామూర్తిని ఏర్పాటు చేశారు.

Also Read : జ‌న సందోహం రామానుజుడి ఉత్స‌వం

Leave A Reply

Your Email Id will not be published!