Ram Nath Kovind : రాబోయే రోజుల్లో సమతా కేంద్రం దేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లనుందని జోస్యం చెప్పారు భారత దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.
దేశ ప్రజల్లో చైతన్యం నింపేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన సమతాకేంద్రంను దర్శించుకున్నారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన శ్రీ భగవద్ రామానుజాచార్యుల స్వర్ణ మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు రామ్ నాథ్ కోవింది(Ram Nath Kovind). ఈ ఉత్సవ మూర్తిని 120 కేజీలకు పైగా బంగారంతో నిర్మించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. దేశమంతా పర్యటించి ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లారని కొనియాడారు. ఇవాళ తనకు ఆనందగా ఉందన్నారు.
ఏ సమాజ ఉద్దరణ కోసం పోరాడారో ఆ మహనీయుడి స్వర్ణ మూర్తిని లోకార్పణం చేయడం మరిచి పోలేనన్నారు. కుల, మతాలు మనుషుల మధ్య బంధాలను పెంపొందించేలా ఉండాలని విద్వేషాలు ఉండరాదని వెయ్యేళ్ల కిందట పోరాడిన ధీశాలి అని కొనియాడారు రామ్ నాథ్ కోవింద్(Ram Nath Kovind).
ప్రజల్లో భక్తి, సమానతల కోసం రామానుజులు కృషి చేశారని అన్నారు. ఇక్కడి శ్రీరామనగరం అద్వైత సమతా క్షేత్రంగా మారనుందని చెప్పారు.
సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలిపారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. దేశంలోని పలు ప్రాంతాలలో తన సందేశాలతో చైతన్యం నింపారన్నారు.
అలాంటి మహనీయుడి స్వర్ణమూర్తిని నెలకొల్పి చిన్న జీయర్ స్వామి చరిత్ర సృష్టించారన్నారు. శ్రీరంగం, కాంచీపురం , వారణాసి నుంచి తన సిద్ధాంతాలను విశ్వ వ్యాప్తం చేశారన్నారు.
భారత దేశంలో దక్షిణాది నుంచి దేశ వ్యాప్తంగా భక్తిని ప్రసరించేలా చేశారన్నారు. గాంధీజీ జైలులో ఉన్న సమయంలో రామానుజ చరిత్ర చదివారని గుర్తు చేశారు.
Also Read : జన సందోహం రామానుజుడి ఉత్సవం