Anurag Thakur : స్వామి ద‌ర్శ‌నం జ‌న్మ ధ‌న్యం

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

Anurag Thakur  : స‌మ‌తా మూర్తి శ్రీ భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యుల‌ను ద‌ర్శించు కోవడంతో త‌న జ‌న్మ ధ‌న్య‌మైంద‌ని అన్నారు కేంద్ర స‌మాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. హైద‌రాబాద్ ముచ్చింతల్ లోని శ్రీ‌రామ‌న‌గ‌రం ఆశ్ర‌మాన్ని ద‌ర్శించుకున్నారు.

యాగ‌శాల‌లో పూజ‌లు చేశారు. అనంత‌రం స‌మ‌తా కేంద్రంను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్క‌రించిన స్వ‌ర్ణ మూర్తిని చూసి విస్తు పోయారు.

భార‌తీయ ఆధ్యాత్మిక‌త‌కు ఆల‌వాలంగా ఇది క‌ల‌కాలం నిలిచి పోతుంద‌న్నారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur ). స‌హస్రాబ్ది మ‌హోత్స‌వాల‌లో భాగంగా కేంద్ర మంత్రి పాల్గొన్నారు. రూ. 1000 కోట్ల‌తో ఇంత భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని ప్ర‌శంసించారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌త్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి ప్ర‌య‌త్నం గొప్ప‌ద‌న్నారు. వెయ్యేళ్ల కింద‌ట ఈ ప‌విత్ర భూమిపై వెల‌సిన శ్రీ రామానుజుడు కుల‌, మ‌తాలు, వ‌ర్గ‌, విభేదాలు ఉండ కూడాద‌ని బోధించార‌ని చెప్పారు.

స‌మ‌తామూర్తి అందించిన స్పూర్తితో ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur ). రాబోయే రోజుల్లో గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాల‌లో స‌మ‌తామూర్తి కూడా ఒక‌టిగా నిలిచి పోతుంద‌ని చెప్పారు.

దేశంలోని ప్ర‌ముఖ ఆల‌యాల‌ను ఒకే చోట 108 దివ్య దేశాల‌ను ఏర్పాటు చేయ‌డం గొప్ప ప్ర‌య‌త్న‌మ‌ని ప్ర‌శంసించారు. శ్రీ‌రామ‌న‌గ‌రం అంతా క‌లియ తిరిగిన అనురాగ్ ఠాకూర్ ను శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి మంగ‌ళ‌శాస‌నాలు అంద‌జేశారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ్టితో స‌హ‌స్రాబ్ది మ‌హోత్స‌వాలు పూర్త‌వుతాయి. ఈనెల 2న ప్రారంభ‌మ‌య్యాయి. భారీ ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

Also Read : స‌మ‌తా కేంద్రం భ‌గ‌వ‌న్నామ స్మ‌ర‌ణం

Leave A Reply

Your Email Id will not be published!