Chinnajeeyar Swamy : ప్రేమ‌ను పంచండి సేవ చేయండి

దివ్య దేశాల ద‌ర్శ‌నం అత్య‌ద్భుతం

Chinnajeeyar Swamy : టెక్నాల‌జీ విస్త‌రించినా, త‌రాలు మారినా భ‌క్తి అన్న‌ది మార‌ద‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌త్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి. హైద‌రాబాద్ ముచ్చింత‌ల్ లో శ్రీ‌రామ‌న‌గ‌రం ఆశ్ర‌మం భ‌క్తుల‌తో నిండి పోయింది.

తెలుగు రాష్ట్రాల‌తో దేశం న‌లుమూలల నుంచి భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. 13 రోజుల పాటు ఉత్స‌వాలు కొన‌సాగాయి. భ‌క్తుల‌ను ఉద్దేశించి కీల‌క ఉప‌దేశం చేశారు చిన్న జీయ‌ర్ స్వామి(Chinnajeeyar Swamy)

స‌మ‌తాకేంద్రంలో భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాలు ఏర్పాటు చేశారు. ఈ దివ్య దేశాల‌ను ద‌ర్శ‌నం చేసుకుంటే యావ‌త్ ప్ర‌పంచంలోని అన్ని దేవాల‌యాల‌ను ద‌ర్శించినంత పుణ్యం ద‌క్కుతుంద‌న్నారు చిన్న జీయ‌ర్ స్వామి(Chinnajeeyar Swamy).

ఈ మ‌హోత్స‌వంలో పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రినీ అభినందిస్తున్న‌ట్లు తెలిపారు. ఇక నుంచి కూడా ఇదే స్పూర్తిని కొన‌సాగించాల్సిన బాధ్య‌త మీ అంద‌రిపై ఉంద‌న్నారు.

216 అడుగుల‌తో ఏర్పాటు చేసిన శ్రీ రామాజ‌నుడి స‌మ‌తా మూర్తి దేశానికి దిక్సూచిగా మారింద‌న్నారు. భార‌త దేశంలోని పుణ్య క్షేత్రాల‌లో ఇది కూడా ఒక‌టిగా మార‌నుంద‌న్నారు.

ఈ విష‌యాన్ని సంద‌ర్శించిన ప్ర‌ముఖులంతా స్ప‌ష్టం చేశార‌ని వెల్ల‌డించారు. జీవితం మ‌రింత అర్థ‌వంతం కావాలంటే భ‌క్తి భావాన్ని క‌లిగి ఉండాల‌ని, ప‌రుల ప‌ట్ల ప్రేమ‌ను క‌లిగి ఉండాల‌ని సూచించారు.

స‌మాజ సేవలో భాగం కావాల‌ని కోరారు. శ్రీ రామానుజుడు బోధించించింది కూడా ఇదేన‌న్నారు. స‌ర్వ మానవులంతా ఒక్క‌టే , స‌మ‌స్త జీవ రాశులు ఒక్క‌టేన‌ని ఆ భావ‌న‌ను క‌లిగి ఉండాల‌న్నారు చిన్న జీయ‌ర్ స్వామి.

దేవుడి ముందు అంతా స‌మానమేన‌ని చాటి చెప్పిన మ‌హ‌నీయుడి జీవితాన్ని ఆద‌ర్శంగా తీసుకోవాల‌న్నారు.

Also Read : ‘స‌మ‌తాకేంద్రం’ విశేషాల స‌మాహారం

Leave A Reply

Your Email Id will not be published!