TTD : శ్రీ‌వారి భ‌క్తుల‌కు శుభ‌వార్త

ఆఫ్ లైన లో టోకెన్ల జారీ

TTD : శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బ‌రు చెప్పింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం – టీటీడీ. క‌రోనా కార‌ణంగా ఆన్ లైన్ లో టోకెన్లు జారీ చేస్తూ వ‌చ్చింది. గ‌తంలో ఆఫ్ లైన్ లో కూడా టోకెన్లు జారీ చేసింది.

ప్ర‌స్తుతం క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో తిరిగి ఆఫ్ లైన్ లో టోకెన్లు జారీ చేసేందుకు శ్రీ‌కారం చుట్టింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది భ‌క్తులు ఉన్నారు. ప్ర‌తి రోజూ వేలాది మంది శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలుమంగమ్మ‌ను ద‌ర్శించుకుంటారు.

క‌రోనా కార‌ణంగా నిలిపి వేసిన టోకెన్ల జారీని పునః ప్రారంభించేందుకు శ్రీ‌కారం చుట్టామ‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD)చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి వెల్ల‌డించారు.

ఈ నిర్ణ‌యాన్ని టీటీడీ పాల‌క‌మండ‌లిలో తీర్మానం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఈనెల 15 నుంచి ఆఫ్ లైన్ స‌ర్వ ద‌ర్శ‌నం టోకెన్లు జారీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది టీటీడీ.

రేప‌టి నుంచి భ‌క్తుల‌కు అందుబాటులోకి రానుంది. 16వ తేదీన ద‌ర్శ‌నం చేసుకునేందుకు 15న ఉద‌యం 9 గంట‌ల‌కు టీటీడీ టోకెన్లు జారీ చేయ‌నుంది.

ఇఒదులో భాగంగా తిరుప‌తి పుణ్య క్షేత్రంలోని భూదేవి కాంప్లెక్స్ , శ్రీ‌నివాసం కాంప్లెక్స్ , శ్రీ గోవింద రాజ స్వామి స‌త్రాల్లో ప్ర‌త్యేక కౌంట‌ర్లు ఏర్పాటు చేసింది.

ప్ర‌తి నిత్యం 15 వేల స‌ర్వ ద‌ర్శ‌నం టోకెన్లు జారీ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వెల్ల‌డించింది. రెండు సంవ‌త్స‌రాల గ్యాప్ త‌ర్వాత తొలిసారిగా భారీ సంఖ్య‌లో స‌ర్వ ద‌ర్శ‌నం టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేసింది టీటీడీ.

ఒక వేళ స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు ఇస్తే ప్ర‌తి రోజూ 40 వేల మంది దాకా ద‌ర్శించుకునే వీలుంది.

Also Read : స‌మ‌తా కేంద్రం భ‌గ‌వ‌న్నామ స్మ‌ర‌ణం

Leave A Reply

Your Email Id will not be published!