Medaram Jatara : ఆసియా ఖండంలోనే అతి పెద్ద కుంభ మేళాగా వినుతికెక్కిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర(Medaram Jatara )సాగేందుకు సిద్దమైంది. ఓ వైపు కరోనా ముప్పు ముంచి ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్సవ భారీ మేళాను నిర్వహించాలని నిర్ణయించింది.
మేడారం జాతరకు 2 కోట్ల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనా. ఇప్పటికే ఏర్పాట్లలో మునిగి పోయింది సర్కార్. రేపటి నుంచి 19 దాకా ఈ జాతర కొనసాగుతుంది.
నాలుగు రోజుల పాటు మేడారం ఉత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా జాతర నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు.
జాతర ప్రాంతాన్ని 8 జోన్లుగా, 13 సెక్టార్లుగా విభజించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.
ఇక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం 3 వేల 845 బస్సులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఊహించిన దాని కంటే ముందే జాతరకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు.
కరోనా దెబ్బకు ముందుగానే చేరుకుని సమ్మక్క సారాలమ్మకు (Medaram Jatara )మొక్కులు తీర్చుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి మేడారంకు పోటెత్తారు.
ఆ ప్రాంతం భక్త జన సంద్రంతో నిండి పోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా జాతర నిర్వహణ కోసం మద్దతు ఇస్తోంది. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపు పరుగులు తీస్తున్నాయి.
చిన్నారుల నుంచి వృద్ధుల దాకా భారీ ఎత్తున తరలి వస్తున్నారు మేడారం జాతర కోసం. ఎక్కడా ఇబ్బందులు ఉండ కూడదని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Also Read : స్వామి దర్శనం జన్మ ధన్యం