Statue Of Equality : హైదరాబాద్ ముచ్చింతల్ లో పదమూడు రోజుల పాటు కొనసాగిన సహస్రాబ్ది మహోత్సవాలు(Statue Of Equality )ముగిశాయి. ఇదిలా ఉండగా ఆఖరి రోజు 14న జరగాల్సిన శాంతి కళ్యాణం ను ఈనెల 19న నిర్వహించాలని నిర్ణయించారు.
ఈనెల 2న ప్రారంభమైన సమతామూర్తి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగాయి. ఊహించని రీతిలో తరలి వచ్చారు భక్తులు. పదేళ్ల కిందట జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి.
5 వేల మంది రుత్వికులు పాల్గొన్నారు. దేశం నలు వైపుల నుంచి భక్తులు శ్రీరామనగరంకు తరలి వచ్చారు. వీరితో పాటు అన్ని రంగాలకు చెందిన వారంతా ఇక్కడికి క్యూ కట్టారు.
నిర్వాహకులు ఆశించిన దానికంటే ఎక్కువగా ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంలు, గవర్నర్లు పాల్గొన్నారు.
లక్షలాది మంది భక్తుల రాకతో పులకించి పోయింది. రూ. 1000 కోట్లు 216 అడుగులతో సమతామూర్తిని(Statue Of Equality )ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణకే కాదు దేశానికే ఓ ఐకాన్ గా మారింది.
అంకురార్ఫణ నుంచి మహా పూర్ణాహుతి దాకా ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొన్నారు. శ్రీ రామానుజుడి స్వర్ణ మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు రాష్ట్రపతి.
నాలుగు మండపాల్లో విశ్వక్సేనేష్టి, నారసింహ ఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి, పరమేష్టి , వైభవేష్టి , హయగ్రీవ ఇష్టి, వేయూహిక ఇష్టి, సుదర్శన ఇష్టి, వైనతే ఇష్టిలను శాస్త్రోక్తంగా చేశారు.
1035 హోమ కుండాల్లో 5 వేల మంది రుత్వికులు మహా పూర్ణాహుతి పలికారు. 108 ఆలయాల్లో దేవతా మూర్తులకు ప్రాణ ప్రతిష్ట చేశారు. నిత్య ఆరాధనకు సిద్దమైంది.
Also Read : స్వామి దర్శనం జన్మ ధన్యం