Trump Truth Social : అమెరికా మాజీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్టే ముందుకు సాగుతున్నారు. అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సామాజిక మాధ్యమాలన్నీ ట్రంప్ ను ముప్పు తిప్పలు పెట్టాయి.
ప్రధానంగా ట్రంప్ పేరుతో ఉన్న వ్యక్తిగత ఖాతాలను కొన్ని గంటలు, కొన్ని రోజుల పాటు నిషేధం విధించాయి. వాటిలో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్, ఫేస్ బుక్ , లింక్డ్ ఇన్ , ఇన్ స్ట్రా గ్రాం, గూగుల్, యూట్యూబ్ కక్ష కట్టాయి.
తన వేదిక ద్వారా హింసను ప్రేరేపించేలా చేశారంటూ సోషల్ మీడియా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాను మీపై ఆధారపడటం ఎందుకు నేనే స్వంతంగా సోషల్ మీడియా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు.
అది కార్య రూపం కూడా దాల్చింది. ట్రూత్ సోషల్ (Trump Truth Social )పేరుతో సోషల్ మీడియా ప్లాట్ ఫాం మీదకు కొన్ని రోజుల్లో రాబోతోంది. ఇదిలా ఉండగా తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ అందించిన సందేశంతో కూడిన స్క్రీన్ షాట్ ను తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ షేర్ చేశాడు.
ట్రూత్ సోషల్ ను ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ కంపెనీ దీనిని డెవలప్ చేసింది. ఇందులో ఆయన ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ స్వాగతం పలికారు.
గెట్ రెడీ మీకు ఇష్టమైన ప్రెసిడెంట్ మళ్లీ కలవబోతున్నారంటూ పేర్కొన్నారు. దీనికి ట్రూత్స్ అని పేరు పెట్టారు. ప్రతి ఒక్కరికీ గొంతుకగా ఉండేందుకే తాము ట్రూత్ సోషల్ ను తీసుకు వచ్చామని సంస్థ సిఇఓ వెల్లడించారు.
Also Read : రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు