Mallikarjun Kharge : కాంగ్రెస్ లో కుటుంబ పోరు లేదు

మ‌ల్లికార్జున ఖ‌ర్గే సంచ‌ల‌న కామెంట్స్

Mallikarjun Kharge : దేశ ప్ర‌ధాన మంత్రి ప‌దే ప‌దే కాంగ్రెస్ పార్టీని కుటుంబ పాల‌న‌గా పేర్కొంటూ వ‌స్తున్నారు. ఆయ‌న ప్ర‌ధానంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆ పార్టీని, రాహుల్ , ప్రియాంక గాంధీల‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు.

దీంతో ప్ర‌ధానిపై ఇవాళ దేశ మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ సైతం తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. దేశం కోసం ఏనాడూ కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాలు చేయ‌లేద‌న్నారు.

దేశంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించు కోకుండా తాత్సారం చేస్తూ త‌మ పార్టీపై నోరు పారేసు కోవ‌డం మాను కోవాల‌న్నారు. ఈ త‌రుణంలో తాజాగా కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, ఎంపీ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) స్పందించారు.

త‌మ పార్టీలో కుటుంబ పోరు లేద‌ని స్ప‌ష్టం చేశారు. బీజేపీ కావాల‌నే బ‌ద్నాం చేస్తోందంటూ మండిప‌డ్డారు. రాజీవ్ గాంధీ త‌ర్వాత ఆ కుటుంబం నుంచి ఎవ్వ‌రూ ప్ర‌ధాన‌మంత్రి కాలేద‌ని గుర్తించాల‌న్నారు.

వాస్త‌వానికి భార‌తీయ జ‌న‌తా పార్టీ లోనే కుటుంబ‌త‌త్వం ఉంద‌ని ఆరోపించారు. వాళ్ల వైపు చూసుకోకుండా త‌మ‌పై రాళ్లు వేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. తాజాగా ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయ‌డం మాను కోవాల‌న్నారు.

ముంద‌స్తు ప్లాన్ లేకుండా దేశాన్ని ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్న మోదీకి త‌మ పార్టీని విమ‌ర్శించే నైతిక హ‌క్కు లేద‌న్నారు మ‌ల్లికార్జున ఖ‌ర్గే(Mallikarjun Kharge). ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను అమ్మ‌కానికి పెట్టిన మోదీ ఈ దేశానికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

లాభాల్లో ఉన్న సంస్థ‌ల‌ను త‌మ అనుయాయుల‌కు క‌ట్ట‌బెట్టే ప‌నిలో ప‌డ్డారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read : పార్టీని వీడ‌ను ప్ర‌జా సేవ మాన‌ను

Leave A Reply

Your Email Id will not be published!