Mulayam Singh Yadav : సమాజవ్ వాదీ పార్టీ ఫౌండర్, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్(Mulayam Singh Yadav )చాలా కాలం తర్వాత ప్రజల్లోకి వచ్చారు. సీఎం యోగి పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలు నెలకొన్నాయని అన్నారు.
ప్రజలు స్పష్టంగా మార్పు కోరుతున్నారని చెప్పారు ములాయం సింగ్ యాదవ్. తన కొడుకును ఆశీర్వదించాలని కోరారు.
ఉత్తర ప్రదేశ్ లోని కర్హల్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అఖిలేష్ యాదవ్ కు ఓట్లు వేయాలని కోరారు.
తమ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.
ప్రజలు యోగి రాచరిక పాలనపై విసిగి పోయారంటూ మండిపడ్డారు.
అమెరికా సహా ప్రపంచంలోని దేశాలన్నీ యూపీ వైపే ఉందన్నారు ములాయం సింగ్. ఆ చరిత్ర సృష్టించ బోయేది మీరేనని పేర్కొన్నారు.
వేదికపై ఉన్న తన తండ్రి పాదాలను తాకి అఖిలేష్ యాదవ్ ఆశీస్సులు అందుకున్నారు.
ఈ ప్రాంతంతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మన రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఎరువులు, విత్తనాల ఏర్పాట్లు చేయాలని సూచించారు. దిగుబడి పెరిగితేనే రైతు పరిస్థితి మెరుగు పడుతుందన్నారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో రెండో విడత పోలింగ్ పూర్తయింది. మూడో దశ పోలింగ్ ఈనెల 20న కర్హాల్ లో జరగనుంది. అఖిలేష్ యాదవ్ ఈ నియోజకవర్గంలో మొదటి సారిగా ఎస్పీ నుంచి పోటీ చేశాడు.
ప్రస్తుతం కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ ను భారతీయ జనతా పార్టీ నిలబెట్టింది. ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్న రీతిలో నెలకొంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 3 కిలోమీటర్ల దూరంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ములాయం సింగ్ (Mulayam Singh Yadav )ను ప్రచారంలోకి తీసుకు రావడాన్ని తప్పు పట్టారు షా.
Also Read : కాంగ్రెస్ లో కుటుంబ పోరు లేదు