YV Subba Reddy : తిరుమలలో ప్రధాన మంత్రి నుంచి పామరుడి వరకు అందరికీ ఒకటే శ్రీవారి ప్రసాదం ఏర్పాటు చేస్తామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy). ఇవాళ తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది.
పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం 2022-23 బడ్జెట్ ను రూ. 3, 096. 40 కోట్లతో ఆమోదించినట్లు వెల్లడించారు సుబ్బారెడ్డి.
త్వరలో శ్రీవారి ఆర్జిత సేవలు పునరుద్దరించడంతో పాటు సర్వ దర్శనం, శ్రీఘ్ర దర్శనం టికెట్లను సంఖ్యను పెంచాలని తీర్మానం చేసిందన్నారు.
సీఎం ఆదేశం మేరకు టీటీడీ ఆధ్వర్యంలో రూ. 230 కోట్లతో పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రి భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపిందన్నారు.
త్వరలో జగన్ రెడ్డి భూమి పూజ చేస్తారన్నారు. టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించేందుకు రూ. 25 కోట్ల నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
తిరుమలలో రాబోయే రోజుల్లో హోటళ్లు, ఫాస్టు ఫుడ్ సెంటర్లు లేకుండా చేస్తామని, ఉచితంగా శ్రీవారి ప్రసాదం అందించాలని తీర్మానం చేసిందన్నారు వైవీ సుబ్బారెడ్డి.
సైన్స్ సిటీ నిర్మాణానికి మంజూరు చేసిన 70 ఎకరాల భూమిలో 50 ఎకరాలు వెనక్కి తీసుకుంటామని, అందులో ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని తీర్మానం చేసిందన్నారు.
అన్నమయ్య మార్గం త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. దీని వల్ల నడక మార్గం దగ్గరవుతుందన్నారు.
రూ. 3. 60 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆయుర్వేద ఫార్మసీకి పరికరాలు కొనుగోలు చేసి రాష్ట్రంలో అందుబాటులో ఉంచాలని తీర్మానం చేసిందన్నారు.
Also Read : రవిదాస్ ఆలయంలో రాహుల్ సేవ