Channi : పంజాబ్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు.
తాను రెండు నియోజకవర్గాలలో ఓడి పోతున్నానంటూ ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై నిప్పులు చెరిగారు చన్నీ(Channi).
ఈ తరుణంలో అమృత్ సర్ లో పార్టీ ర్యాలీ సందర్భంగా ప్రియాంక గాంధీని ఉద్దేశించి ఆమె తమ బహు అంటూనే యూపీ,
బీహార్ భాయ్ లను ఇక్కడికి రానివ్వ బోమంటూ హెచ్చరించారు. వారికి పాలించే హక్కు లేదన్నారు.
ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ సీఎం నితీష్ కుమార్.
తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కుమార్ విశ్వాస్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలపై దమ్ముంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
తనపై వస్తున్న దాడుల నుంచి రక్షించుకునేందుకు చన్నీ ఈ ఎత్తుగడ వేశారు.
ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖ కాపీని ఆయన బహిరంగ పరిచారు. రాజకీయాలను పక్కన పెడితే.
వేర్పాటు వాదంతో పోరాడుతున్నప్పుడు పంజాబ్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారు.
ప్రధాని ప్రతి పంజాబీ ఆందోళనను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు చన్నీ(Channi). రాజకీయ ప్రత్యర్థులకు మందుగుండు సామాగ్రిని అందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read : అఖిలేష్ యాదవ్ కు పట్టం కట్టండి