Kumar Vishwas : కుమార్ విశ్వాస్ కామెంట్స్ క‌ల‌క‌లం

ఎన్నిక‌ల వేళ ఆప్ కు భారీ దెబ్బ

Kumar Vishwas : ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ చీఫ్ కుమార్ విశ్వాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. పంజాబ్ లో ఎలాగైనా స‌రే పాగా వేయాల‌ని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కే్జ్రీవాల్ అండ్ టీంకు ఇది కోలుకోలేని దెబ్బ‌.

ఒక‌ప్పుడు ఆప్ లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు కుమార్ విశ్వాస్. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 117 సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈనెల 20న పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

అర‌వింద్ కేజ్రీవాల్ ఖ‌లిస్తానీ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇచ్చాడ‌ని కుమార్ విశ్వాస్(Kumar Vishwas) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. పంజాబ్ ప్ర‌జ‌లు శాంతిని కోరుకుంటార‌ని ఆప్ వెనుక ఉన్న దురుద్దేశాన్ని గ్ర‌హించాల‌ని విశ్వాస్ కోరాడు.

ఎన్నిక‌ల‌కు కొద్ది గంట‌ల ముందు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఆప్ లో క‌ల‌క‌లం రేపాయి. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న ఆప్ ల‌బ్ది పొందేందుకు ఆప్ చీఫ్ బిగ్ ప్లాన్ వేశాడ‌ని, ఇందులో భాగంగానే ఆయ‌న ఖ‌లిస్తాన్ ఉద్య‌మానికి లోపాయికారి మ‌ద్ద‌తు ఇచ్చాడంటూ ఆరోపించాడు.

జాతీయ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ కుమార్ విశ్వాస్(Kumar Vishwas) ఈ ఆరోప‌ణ‌లు చేశాడు. స్వ‌తంత్ర దేశానికి తాను ప్ర‌ధాన‌మంత్రి అవుతాన‌ని ఒక‌సారి చెప్పారంటూ బాంబు పేల్చాడు.

ఇదిలా ఉండ‌గా ఖ‌లిస్తానీ ఉద్య‌మం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్ర‌త్యేక దేశంగా ఉండాల‌ని పోరాడుతున్నారు. ఒక రోజు పంజాబ్ కు సీఎం లేదా ఖ‌లిస్తాన్ దేశానికి తాను పీఎం అవుతాన‌ని త‌న‌తో చెప్పాడ‌ని తెలిపాడు.

పంజాబ్ నుంచి ఖ‌లిస్తాన్ ను వేరు చేయాలా వ‌ద్దా అని నిర్ణ‌యించేందుకు యుఎస్ ఆధారిత ఎస్ఎఫ్‌జే నిర్వ‌హించే ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు పాక్ కు చెందిన ఐఎస్ఐ, ఇత‌ర ఏజెన్సీలు నిధులు ఇస్తున్నాయని తాను ఆరోపించాన‌న్నాడు.

కేజ్రీవాల్ అయితే ఏంటి..స్వ‌తంత్ర దేశానికి తాను పీఎం కావాల‌ని అనుకున్నాన‌ని అన్నాడ‌ని తెలిపాడు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని సీఎం చ‌న్నీ డిమాండ్ చేశారు.

Also Read : ఉచిత విద్యుత్ వ‌ద్ద‌న్నందుకే తొల‌గించాం

Leave A Reply

Your Email Id will not be published!