KV Rajnedranath Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్ర నాథ్ రెడ్డి ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఏపీ డీజీపీగా కొలువు తీరిన రాజేంద్ర నాథ్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు మాజీ డీజీపీ. ఇక కసిరెడ్డి వెంకట రాజేంద్ర నాథ్ రెడ్డిKV Rajnedranath Reddy )దేశంలోనే ఇన్వెస్టిగేషన్ కేసులను ఛేదించడంలో ఆరి తేరారు.
1992 బ్యాచ్ కు చెందిన రాజేంధ్ర నాథ్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా పని చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1994లో నిజామాబాద్ జిల్ఆ బోధన్ అదనపు ఎస్పీగా చేరారు. అక్కడ వివిధ హోదాలలో పని చేశారు.
మంచి పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి విశాఖ పట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా విధులు చేపట్టారు.
కసిరెడ్డి వెంకట రాజేంద్ర నాథ్ రెడ్డి ఎక్కడ పని చేసినా మంచి పేరు సంపాదించుకున్నారు. అంతే కాకుండా హైదరాబాద్ వెస్ట్ జోన్ , మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పని చేశారు. పలు కీలక కేసులు ఛేదించి అంతా తన వైపు చూసేలా చేసుకున్నారు.
మాజీ డీజీపీకి సీఎం జగన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమించారు. ఇక కొత్త డీజీపీ ఏప్రిల్ 30, 2026న పదవీ విరమణ చేయాల్సి ఉంది.
రాష్ట్ర టాప్ కాప్ గా ఎంప్యానెల్ మెంట్ కు అర్హులైన ఐపీఎల్ ఆఫీసర్లలో కేవీఆర్ఎన్ రెడ్డితో పాటు ద్వారకా తిరుమల రావు, పీఎస్ఆర్ ఆంజనేయులు, వీఎస్కే కౌముది , ఎఆర్ అనురాధ ఉన్నారు.
Also Read : ఏపీ..తెలంగాణ కలవడం కష్టం