Tamil Nadu Local Elections : స్టాలిన్ ప‌ని తీరుకు రెఫ‌రెండం

10 ఏళ్ల త‌ర్వాత స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు

Tamil Nadu Local Elections : త‌మిళ‌నాడులో అనూహ్యంగా కొలువు తీరిన డీఎంకే ప్ర‌భుత్వం స్టాలిన్ నేతృత్వంలో ముందుకు సాగుతోంది. ఇప్ప‌టికే పాల‌నా ప‌రంగా సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. వ‌ర‌ద‌ల‌ను త‌ట్టుకున్నారు. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు త‌న‌దైన శైలిలో షాక్ ఇచ్చారు.

ప్ర‌స్తుతం క్లీన్ ఇమేజ్ తో ముందుకు వెళుతున్నారు సీఎం స్టాలిన్. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా చాలా జాగ్ర‌త్త‌గా పాల‌న సాగిస్తున్నారు. తాను ప్ర‌జ‌ల మ‌నిషిన‌ని చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అందులా చాలా మ‌టుకు స‌క్సెస్ అయ్యారు కూడా. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో 10 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు(Tamil Nadu Local Elections) జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు స్టాలిన్ ప్ర‌భుత్వానికి, ఆయ‌న ప‌నితీరుకు రెఫ‌రెండంగా మార‌నున్నాయి.

అమ‌లుకు నోచుకోని వాగ్ధానాలు, హామీల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌రంటోంది ప్ర‌తిప‌క్ష అన్నాడీఎంకే. ఇప్ప‌టికే అసెంబ్లీ, లోక్ స‌భ లలో వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్లారు స్టాలిన్. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల‌పై ఫోక‌స్ పెట్టారు.

చెన్నైతో స‌హా 21 న‌గ‌రాలలో పోలింగ్ జ‌రిగింది. 12 వేల కంటే ఎక్కువ మంది స‌భ్యు ల్ని ఎన్నుకోబోతున్నారు. 138 మున్సిపాలిటీలు, 490 ప‌ట్ట‌ణ పంచాయితీలు, 12 వేల కంటే ఎక్కువ మందిని ఎన్నుకుంటారు.

గ‌త ఐదేళ్లుగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌క పోవ‌డంతో ఈ సంస్థ‌ల‌కు ప్ర‌జా ప్ర‌తినిధులంటూ ఎవ‌రూ లేరు. స్టాలిన్ వ‌చ్చాక సీన్ మారింది. ఎల‌క్ష‌న్స్ కు ద్వారాలు తెరిచారు.

మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ. 1,000 న‌గ‌దు చెల్లింపు కంటిన్యూ అవుతుంద‌ని స్టాలిన్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఏది ఏమైనా ఈ ఎన్నిక‌లు అటు డీఎంకేకు ఇటు అన్నాడీఎంకే, బీజేపీ, ఇత‌ర పార్టీల‌కు స‌వాల్ గా మారాయి.

Also Read : క‌ర్తార్ పూర్’ విష‌యంలో కాంగ్రెస్ విఫ‌లం

Leave A Reply

Your Email Id will not be published!