Modi : ‘గోబ‌ర్ ధ‌న్’ ను ప్రారంభించిన మోదీ 

ఆసియాలోనే బిగ్ బ‌యో సీఎన్జీ ప్లాంట్ 

Modi : ఆసియా లోనే అతి పెద్ద బ‌యో – సీఎన్జీ ప్లాంట్ గ్లోబ‌ర్ ధ‌న్ ను ప్రారంభించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ(Modi). వేస్ట్ టు వెల్త్ అనే సూత్రం ప్ర‌కారం ప‌ట్ట‌ణ ప్రాంతాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచేందుకు దీనిని ఏర్పాటు చేశామ‌న్నారు మోదీ.

బ‌యో సీఎన్జీ ప్లాంట్ నిర్మాణం అభినంద‌నీయ‌మైన ప్ర‌య‌త్న‌మ‌ని చెప్పారు ప్ర‌ధాన మంత్రి. ఇవాళ మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఇండోర్ లో గోబ‌ర్ ధ‌న్ ప్లాంట్ ను స్టార్ట్ చేశారు.

మునిసిప‌ల్ సాలిడ్ వేస్ట్ ఆధారిత గోబ‌ర్ ధ‌న్ ప్లాంట్ స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ అర్బ‌న్ 2.0 కింద చెత్త ర‌హిత న‌గ‌రాలు సృష్టించాల‌నే ల‌క్ష్యంతో ప‌ని చేస్తున్నామ‌న్నారు.

ఇందులో భాగంగా దేశం మొత్తం చెత్త ర‌హితంగా చేస్తామ‌న్నారు. ఇప్ప‌టికే ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త అన్న కాన్సెప్ట్ తో ముందుకు వెళుతున్నామ‌ని చెప్పారు ప్ర‌ధాన మంత్రి.

త‌మ ప్ర‌ధాన కార్యాల‌యం కూడా ప‌ర్యావ‌ర‌ణ ర‌హితంగా ఉంటుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం శివ రాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ పాల్గొన్నారు.

ప్ర‌తి ఒక్క‌రు చెత్త చెదారాన్ని త‌మ‌కు అందుబాటులో ఉన్న చెత్త బుట్ట‌ల్లోనే వేయాల‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రు ప‌రిశుభ్ర‌త‌కు ప్ర‌యారిటీ ఇవ్వాల‌ని మోదీ కోరారు.

ఇదిలా ఉండ‌గా గోబ‌ర్ ధ‌న్ ప్లాంట్ 550 ట‌న్నుల వేరు చేయ‌బ‌డిన త‌డి సేంద్రీయ వ్య‌ర్థాల‌ను శుద్ది చేస్తుంది. రోజుకు 17,000 కిలోల సీఎన్జీ , 100 ట‌న్నుల సేంద్రీయ కంపోస్ట్ ను ఉత్ప‌త్తి చేస్తుంది.

పీఎంఓ తెలిపిన ప్ర‌కారం ఈ ప్లాంట్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల‌ను త‌గ్గించి, సేంద్రీయ కంపోస్ట్ తో పాటు ఎరువుగా గ్రీన్ ఎన‌ర్జీ అందిస్తుంది.

Also Read : ప్ర‌త్య‌ర్థులు ఒక్క‌టైనా ఆప్ దే విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!