Priyanka Gandhi : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. ఉత్తరాఖండ్ సీఎం హిమంత బిశ్వ శర్మ తమ పేరెంట్స్ పై చేసిన వ్యాఖ్యలపై ఆలస్యంగా స్పందించారు.
రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం ఇలా దిగజారి మాటలు మాట్లాడటం మంచి పద్దతి కాదని స్పష్టం చేశారు. సీఎం కామెంట్స్ దేశ వ్యాప్తంగా తీవ్ర రాద్ధాంతం రేపాయి. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు.
సీఎం బిశ్వ శర్మపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో బిశ్వ శర్మ పై ఫిర్యాదు చేశారు.
దీంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం కలకలం రేపింది. ఈ తరుణంలో ప్రియాంక బిశ్వ శర్మ తన స్థాయికి దిగజారి మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి ప్రియాంక గాంధీ ఈ దేశ ప్రధానిగా ఉంటూనే విలువైన ప్రాణం కోల్పోయారని గుర్తు చేశారు.
ఒకరి గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) సూచించారు. తమ కుటుంబం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిందని ఆ విషయం ఈ దేశానికి తెలుసన్నారు.
కానీ భారతీయ జనతా పార్టీ లేదా సీఎం బిశ్వ శర్మ కుటుంబంలో ఎవరైనా అమరులయ్యారా అని ప్రశ్నించారు. ఈ దేశం కోసం తన తల్లి సోనియా జీవితాన్ని అర్పించారని చెప్పారు.
యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రియాంక గాంధీ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : ‘గోబర్ ధన్’ ను ప్రారంభించిన మోదీ