CM KCR : ఉద్ద‌వ్ తో కేసీఆర్ భేటీపై ఉత్కంఠ‌

మ‌రాఠాలో కేసీఆర్ హ‌ల్ చ‌ల్ 

CM KCR : దేశ వ్యాప్తంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న గ‌త కొంత కాలంగా మౌనంగా ఉంటూ వ‌చ్చారు. కానీ త‌న రూట్ మార్చేశారు.

ఇప్పుడు నువ్వా నేనా అన్న రీతిలో ఫైట్ మొద‌లు పెట్టారు దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై. ప్ర‌ధానిని దేశం నుంచి త‌రిమి కొట్టాల‌ని పిలుపునిచ్చారు.

ద‌మ్ముంటే దా న‌న్ను ట‌చ్ చేసి చూడు అంటూ స‌వాల్ విసిరారు. నా జాత‌కం నీ ద‌గ్గ‌ర ఉంటే బీజేపీకి చెందిన నేత‌ల జాత‌కాలు, స్కాంలు త‌న వ‌ద్ద ఉన్నాయంటూ హెచ్చ‌రించారు.

దీంతో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మ‌ధ్య ప్ర‌చ్చ‌న్న యుద్దం ప్రారంభ‌మైంది. ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల తూటాలు పేల్చుతున్నారు. చివ‌ర‌కు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరుకుంది.

దిష్టి బొమ్మ‌ల ద‌హ‌నం కూడా ప్రారంభ‌మైంది. ఇక త‌న‌యుడు కేటీఆర్ సైతం మాట‌ల తీవ్ర‌త పెంచారు. దీంతో ప్ర‌ధానికి, బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌త్యామ్నాయ కూట‌మిని త‌యారు చేసే ప‌నిలో ప‌డ్డారు. గ‌తంలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాన‌ని చెప్పారు.

ఇప్ప‌టికే మ‌మ‌తా బెన‌ర్జీ, ఎంకే స్టాలిన్, పిన‌ర‌య్ విజ‌య‌న్, సీతారం ఏచూరి ల‌ను క‌లిశారు. ప్ర‌స్తుతం మోదీతో క‌య్యానికి కాలు దువ్వుతున్న శివ‌సేన పార్టీ  చీఫ్‌, మ‌రాఠా చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రేతో భేటీ అయ్యారు.

ఎలాగైనా స‌రే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించే ప్లాన్ లో భాగంగానే ఇవాళ కేసీఆర్(CM KCR) సీఎంతో భేటీ అయ్యారు. రాత్రికి తిరుగు ప్ర‌యాణం అవుతారు. ఠాక్రేతో మాట్లాడాక ఎన్సీపీ ప‌వార్ తో క‌లుస్తారు.

ఇదిలా ఉండగా కేసీఆర్ టూర్ సంద‌ర్భంగా ముంబైలో ఇద్ద‌రు సీఎంల ఫోటోలు, ఫ్లెక్సీలు క‌నిపించ‌డం విశేషం.

Also Read : రైతుల పంతం బీజేపీ అంతం

Leave A Reply

Your Email Id will not be published!