Sonia Gandhi : దేశ రాజకీయాలు మారుతున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తన క్యాడర్, శ్రేణులను వచ్చే లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది.
దీంతో ఎలాగైనా పోయిన పరువు తెచ్చుకునేలా, ప్రత్యామ్నాయంగా మారేలా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు పార్టీని వీడుతున్నారు.
దీంతో పార్టీ కలిసి వచ్చే పార్టీలతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీలో సోనియా గాంధీ అఖిలపక్షం నేతలతో భేటీ అయ్యారు.
తాజాగా దేశం లోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మణిపూర్ , ఉత్తరాఖండ్ , గోవా, పంజాబ్ రాష్ట్రాలలో పూర్తయ్యాయి. భారీ ఎత్తున నియోజకవర్గాలు ఉండడంతో యూపీలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి.
ఇంకా నాలుగు విడతలుగా పోలింగ్ జరగాల్సి ఉంది. ఆయా రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi )కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ విషయాన్ని పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి కూడా. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలను అన్నింటిని ఒకే వేదిక పైకి తీసుకు వచ్చే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ.
ఇప్పటికే సోనియా గాంధీ ఎవరెవరిని పిలవాలనే దానిపై కూడా చర్చించినట్లు సమాచారం. గతంలో జరిగిన అఖిలపక్షం సమావేశానికి టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీని ఆహ్వానించ లేదు.
ఈ సారి అందరినీ, అన్ని పక్షాలను పిలవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం సోనియా గాంధీ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
Also Read : పంజాబ్ లో శాంతి భద్రతలు ముఖ్యం