Sonu Sood : సోనూ సూద్ వాహ‌నం సీజ్

పోలింగ్ బూత్ లోకి ప్ర‌వేశం

Sonu Sood : ప్ర‌ముఖ న‌టుడు, సామాజిక కార్య‌క‌ర్త సోనూ సూద్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. పంజాబ్ ఎన్నిక‌ల్లో భాగంగా సోనూసూద్(Sonu Sood) చెల్లెలు మాళ‌విక సూద్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా మెగా నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇప్ప‌టికే ఆయ‌న పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా చేప‌ట్టారు. సీఎం చ‌న్నీ అయితే పంజాబ్ కు బాగుంటుంద‌ని సెల‌విచ్చారు. ఈ త‌రుణంలో ఇవాళ రాష్ట్రంలోని 117 నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోలింగ్ జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే సీఎం చ‌న్నీతో పాటు పీసీసీ చీఫ్ సిద్దూ, మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ , అకాలీద‌ళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాద‌ల్ , కేంద్ర మాజీ మంత్రి కౌర్ కూడా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

ఇవాళ పోలింగ్ కావ‌డంతో ఎన్నిక‌ల రూల్స్ కు వ్య‌తిరేకంగా న‌టుడు సోనూ సూద్ త‌న కారులో పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు య‌త్నించాడు. దీంతో ఆయ‌న ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

మెగా ఎన్నిక‌ల అధికారి ఈ మేర‌కు ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు కూడా. పోలింగ్ స‌మ‌యంలో సోనూ సూద్(Sonu Sood) గ‌నుక ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

ఈ ఏడాది జ‌న‌వ‌రి 10న సోనూ సూద్ సిస్ట‌ర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వెంట‌నే మెగా నుంచి టికెట్ కేటాయించారు పీసీసీ చీఫ్ సిద్దూ. ఇదిలా ఉండ‌గా విప‌క్షాలు ప్ర‌త్యేకించి అకాలీద‌ళ్ కు చెందిన కొంద‌రు వివిధ బూత్ ల‌లోకి వెళ్లి బెదిరిస్తున్న‌ట్లు స‌మాచారం వ‌చ్చింది.

కొన్ని బూత్ ల‌లో డ‌బ్బులు కూడా ఇస్తున్న‌ట్లు తెలిసింది. ఎన్నిక‌లు స‌జావుగా జ‌రిగేలా చూడాల‌ని తాను వెళ్లాన‌ని సోనూ సూద్ చెప్పారు.

Also Read : అన్నను క‌లిసిన త‌మ్ముడు

Leave A Reply

Your Email Id will not be published!