KTR : అపారమైన వనరులు, అవకాశాలు ఉన్నాయి ఈ దేశంలో. వాటిని గుర్తించి ఆచరణలోకి తీసుకు రాగలిగితే అద్భుతాలు సృష్టించ వచ్చని స్పష్టం చేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.
2030 నాటికి ఇండియా అభివృద్ది అనే అంశంపై వర్చువల్ విధానంలో జరిగిన హార్వర్డ్ యూనివర్శిటీ నిర్వహించిన సదస్సులో ప్రసంగించారు. తెలంగాణ ఇప్పుడు దేశానికి ఆదర్శంగా మారిందన్నారు.
ఒక వేళ ఈ దేశం మొత్తం తాము అనుసరించిన విధానాలను, పద్దతలను ఉపయోగించినట్లయితే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం ఖాయమన్నారు కేటీఆర్.
ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా మారే ఛాన్స్ ఉందన్నారు. ప్రపంచంలో అతి పెద్ద చేనేత ఉత్పత్తి చేసే దేశంగా ఉన్నప్పటికీ బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల కన్నా తక్కువ దుస్తులను ఎందుకు ఉత్పత్తి చేస్తోందంటూ ప్రశ్నించారు.
ప్రత్యేకంగా ఈ దేశంలో వైద్య రంగ పరికరాల ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయో ఆలోచించాలని పేర్కొన్నారు కేటీఆర్(KTR). ఎక్కడ లోపం ఉందో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇండియా కంటే అతి చిన్న దేశాలైన వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు ఉత్పత్తి చేయడంలో ముందంజలో ఉన్నాయని అవి అనుసరిస్తున్న విధానాలు ఏమిటో చూడాలన్నారు.
నదులు నిండా పారుతున్నప్పటికీ ఎండి పోతున్న బీడు భూములు ఎందుకు ఉన్నాయని అన్నారు. దేశంలోని ప్రభుత్వాలు, మేధావులు, విద్యా వేత్తలు, విజ్ఞులు ఆలోచించాలన్నారు మంత్రి.
గత ఏడు ఏళ్లలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ప్రస్తుతం ఐటీ హబ్ గా , ఫార్మా హబ్ గా, అగ్రి హబ్ గా, ఆధ్యాత్మిక హబ్ గా మారిందన్నారు కేటీఆర్.
Also Read : అబద్దాలు ఆడడంలో కేసీఆర్ దిట్ట