AP Govt : ఏపీలో గత కొంత కాలంగా ఉత్కంఠ రేపుతూ వచ్చిన పీఆర్సీ వివాదం ఎట్టకేలకు సమిసింది. అటు ప్రభుత్వం ఇటు ఉద్యోగ సంఘాలు ఒక కొలిక్కి వచ్చాయి. ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఎట్టకేలకు గొడవ సద్దుమణిగేలా చేసింది.
దీంతో ఈ ఏడాది జనవరి 1 నుంచే పే రివిజన్ కమిషన్ – పీఆర్సీకి సంబంధించిన కొత్త జీవోలను విడుదల చేసింది ఏపీ సర్కార్(AP Govt). హెచ్ఆర్ఏ శ్లాబులను సవరించింది. సీసీఏను పునరుద్దరించింది.
పెన్షనర్లకు పెన్షన్ రేట్లను పెంచింది. ఏపీ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి మొత్తం ఐదు జీవోలను జారీ చేశారు. ఇందులో భాగంగా ఇంటి రెంట్ అలవెన్సుల శ్లాబులను 10, 12, 16, 24 శాతానికి సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పెన్షనర్లకు అదనపు పెన్షన్ ను 70 ఏళ్ల నుంచే ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది సర్కార్. పే స్కేల్ కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో కమిటీ మరోసారి ఉద్యోగ సంఘాలతో సమావేశమైంది. వారి కోరికలను మన్నించింది.
కొన్నింటిని అమలు చేసేందుకు ఒప్పుకుంది. కమిటీలో కీలకంగా ఉన్న మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో పాటు సీఎస్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యింది.
రెండు రోజుల పాటు ఈ చర్చలు కొనసాగాయి. చివరకు కొలిక్కి రావడంతో జీవోలు జారీ చేసింది ఏపీ సర్కార్(AP Govt). ఇందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డికి ఉద్యోగులు కృతజ్క్షతలు తెలిపారు.
Also Read : ఈ జన్మలో బాబు సీఎం కాలేడు