Govt Block : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దేశ వ్యతిరేక ప్రచారానికి మద్దతు ఇస్తున్న పంజాబ్ పాలిటిక్స్ టీవీపై(Govt Block) నిషేధం విధించింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇంటర్నెట్ మాధ్యమంగా ఆన్ లైన్ మీడియాను ఉపయోగించేందుకు ఛానల్ ప్రయత్నిస్తోందని సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ ఇవాళ స్పష్టం చేసింది.
ఢిల్లీలో రైతుల నిరసన సందర్భంగా చారిత్రాత్మక ఎర్రకోట స్మారక చిహ్నం వద్ద వ్యవసాయ సంఘం జెండాతో పాటు సిక్కు మత జెండాను పట్టుకుని ఓ వ్యక్తి వేలాడ దీశాడు.
నిషేధిత ఖలిస్తాన్ అనుకూల సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నందున విదేశీ ఆధారిత పంజాబ్ పాలిటిక్స్ టీవీని నిషేధింస్తున్నట్లు తెలిపింది.
అంతే కాకుండా సదరు టీవికి చెందిన యాప్ లు, వెబ్ సైట్ , సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ (Govt Block)చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
పంజాబ్ ఎన్నికల సమయంలో దీనిని వేదికగా చేసుకుని సంఘ విద్రోహ శక్తులు ప్రజలకు భంగం కలిగించేలా వ్యవహరించారంటూ స్పష్టం చేసింది. ఈ ఛానల్ దేశ వ్యతిరేక ప్రచారం చేస్తోందంటూ ఆరోపించింది.
ఈ ఛానల్ డిజిటల్ ప్లాట్ ఫారమ్ లపై క్రియేట్ చేస్తున్న కంటెంట్ అంతా మత సామరస్యాన్ని దెబ్బ తీసేలా వేర్పాటు వాదాన్ని ప్రేరేపించేలా ఉందంటూ కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.
భారత సార్వభౌమాధికారం, సమగ్రత , రాష్ట్ర భద్రత , పబ్లిక్ ఆర్డర్ కు హానికరంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపింది.
Also Read : సీఎం యోగిపై అఖిలేష్ సీరియస్