Tamil Nadu Elections : పుర, స్థానిక ఎన్నికల్లో డీఎంకే జోరు
స్టాలిన్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం
Tamil Nadu Elections : తమిళనాడులో పవర్ లో ఉన్న డీఎంకే సర్కార్ ఢంకా భజాయించింది. ఊహించని రీతిలో పదేళ్ల తర్వాత జరిగిన పుర, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను(Tamil Nadu Elections) కైవసం చేసుకుంది.
విచిత్రం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఆ పార్టీ అన్నాడీఎంకేను దాటేసి రెండో స్థానంలో నిలిచింది. ఇది కోలుకోలేని షాక్ గా భావించక తప్పదు.
ఈ ఎన్నికలు తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అని ముందుగానే ప్రకటించారు డీఎంకే చీఫ్ , తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్. అన్నాడీఎంకేకు పూర్తి పట్టున్న ప్రాంతంలో కూడా అధికార పార్టీ పాగా వేసింది.
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే క్లీన్ స్విప్ చేసిన పశ్చిమ తమిళనాడులో డీఎంకే 75 శాతం సీట్లను గెలుచుకుంది. ఇది ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో ప్రజలు ఉన్నారనేందుకు ఓ నిదర్శనం.
ఇక కోయంబత్తూరు ప్రాంతంలో రెండుసార్లు ప్రత్యర్థి చేతిలో ఓడి పోయినప్పటికీ అన్నాడీఎంకే మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. కాగా పట్టణ పౌర ఎన్నికల్లో డీఎంకే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది.
ఇక స్థాలిన్ ముఖ్యమంత్రిగా కొలువు తీరి తొమ్మిది నెలలు అవుతోంది. డీఎంకే వచ్చిన ఫలితాలపై సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతాలపై పార్టీ ఫోకస్ పెట్టిందని డీఎంకే నేతలు వెల్లడించారు.
చెన్నై సహా 21 నగరాల్లో ఎన్నికలు జరిగాయి. 138 మున్సిపాలిటీలు, 490 పట్టణ పంచాయతీలు, 12 వేల మంది కంటే ఎక్కువ సభ్యులను ఎన్నుకుంటారు.
కార్పొరేషన్లలోని మొత్తం 1,374 వార్డులలో డీఎంకే ఇప్పటి దాకా 425, అన్నా డీఎంకే 75 గెలుపొందింది. మున్సిపాలిటీల లోని 3, 843 వార్డు సభ్యుల స్థానాల్లో ఇప్పటి దాకా డీఎంకే 1, 832 గెలుచుకోగా అన్నాడీఎంకే 494 సీట్లు గెలుచుకుంది.
Also Read : ప్రైవేటీకరణ చేస్తూ పోతే బతకడం ఎలా