MK Stalin : తమిళనాడులో జరిగిన పుర, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ డీఎంకే ఊహించని రీతిలో సత్తా చాటింది. 10 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఎన్నికలు జరిగాయి.
అనూహ్యంగా అన్నాడీఎంకే పట్టు ఉన్న ప్రాంతాలలో సైతం డీఎంకే జయ కేతనం ఎగుర వేసింది. ఈ సందర్భంగా డీఎంకే చీఫ్, సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) మీడియాతో మాట్లాడారు.
తమ పారదర్శక పాలనకు, పని తీరుకు ఈ ఫలితాలు నిదర్శనమని స్పష్టం చేశారు. తమపై నమ్మకం ఉంచి అఖండ విజయాన్ని కట్ట బెట్టిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటానని చెప్పారు స్టాలిన్.
తాము అధికారంలోకి వచ్చి కేవలం 9 నెలలు మాత్రమే అయ్యిందని, కానీ తాము ప్రజలకు మెరుగైన రీతిలో పాలనను అందజేస్తున్నామని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథాకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పూర్తి పారదర్శక పాలనతో ముందుకు సాగుతున్నామన్నారు సీఎం. ప్రతిపక్షాలు తమ ఉనికిని కోల్పోయాయని వారు చేస్తున్న ఆరోపణలలో నిజం లేదన్నారు.
గెలుపొందిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని తెలిపారు. ఇక నుంచి కూడా ప్రజలతో కలిసి పోయి పాలన అందిస్తామని స్పష్టం చేశారు స్టాలిన్. ఇదిలా ఉండగా పుర, స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది డీఎంకే.
ఇక ఓట్ల శాతంగా చూస్తే అన్నా డీఎంకేకు కోలుకోలేని షాక్ తగిలింది. ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ తన ఓటు బ్యాంకు పెంచుకోవడం ఒకింత ఆసక్తి కలిగించే పరిణామం అని చెప్పక తప్పదు.
Also Read : యూపీలో కొనసాగుతున్న పోలింగ్