Mayawati : బహుజన్ సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం మాయావతి సంచలన కామెంట్స్ చేశారు. యూపీలో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది.
ఇవాళ లక్నోలో మాయావతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువ ఓటు బ్యాంకు కలిగిన ముస్లింలు ఈసారి సమాజ్ వాది పార్టీని పూర్తిగా తిరస్కరించారని చెప్పారు.
దీంతో అఖిలేష్ యాదవ్ కన్న కలలు కల్లలేనని స్పష్టం చేశారు. ఆ పార్టీ అనుసరించిన విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో యోగి సర్కార్ రాచరిక పాలన సాగిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ కూటమి పవర్ లోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. సమాజ్ వాది పార్టీకి ఈసారి ముస్లింలు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఎస్పీకి ఓటు వేయడం అంటే గుండా రాజ్ , మాఫియా రాజ్ ను తిరిగి తీసుకు రావడం తప్ప మరొకటి కాదన్నారు. అందుకే ఎస్పీని పూర్తిగా తిరస్కరిస్తున్నారని చెప్పారు మాయావతి(Mayawati ).
ఓటు వేయక ముందే వారు తీర్మానం చేసుకున్నారని అన్నారు. సమాజ్ వాది పార్టీ హయాంలో రాష్ట్రంలో అల్లర్లు అనేకం జరిగాయి. లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయలేక పోయారు.
అందుకే ఆ పార్టీని ఓడించారని అన్నారు. తాము అధికారంలోకి రాలేమని వారి ముఖాలే చెబుతున్నాయంటూ ఎద్దేవా చేశారు మాయావతి. తాము పవర్ లోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు బీఎస్పీ చీఫ్.
Also Read : ఈ విజయం ప్రభుత్వ పని తీరుకు పట్టం