Nawab Malik : మ‌నీ లాండ‌రింగ్ కేసులో న‌వాబ్ మాలిక్ అరెస్ట్

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంలో క‌ల‌క‌లం

Nawab Malik  : మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్(Nawab Malik )ను అరెస్ట్ చేసింది. ఆయ‌న‌కు ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే ఈడీ అదుపులోకి తీసుకుంద‌ని శివ‌సేన ఆరోపించింది.

ఉద‌యం ఇంటికి వెళ్లిన ఈడీ మంత్రితో పాటు త‌న‌యుడిని సైతం విచార‌ణ కోసం ఆఫీసుకు తీసుకు వెళ్లింది. 5 గంట‌ల‌కు పైగా ప్ర‌శ్నించింది.

ముంబై అండ‌ర్ వ‌ర‌ల్డ్ దావూద్ ఇబ్ర‌హీం కార్య‌క‌లాపాల‌తో ముడి ప‌డి ఉన్న మ‌నీ లాండ‌రింగ్ కు సంబంధించి ప్ర‌శ్నించింది. మ‌నీ లాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం కింద మంత్రి న‌వాబ్ మాలిక్ (Nawab Malik )వాంగ్మూలాన్ని ఈడీ న‌మోదు చేసింది.

అక్ర‌మ ఆస్తుల లావాదేవీలు, హ‌వాలా లావాదేవీల‌కు సంబంధించి అండ‌ర్ వ‌ర‌ల్డ్ కార్య‌క‌లాపాల‌కు సంబంధించి ఈనెల 15న ముంబైలో కొత్త‌గా కేసు న‌మోదు చేసింది.

దాడులు చేప‌ట్టాక ఈడీ చ‌ర్య తీసుకుంది. దీంతో పాటు 1993 ముంబై పేలుళ్ల సూత్ర‌ధారి ప‌రారీలో ఉన్న గ్యాంగ్ స్ట‌ర్ దావూద్ ఇబ్ర‌హీం దివంగ‌త సోద‌ర హ‌సీనా పార్క‌ర్ , సోద‌రుడు ఇక్బాల్ క‌స్క‌ర్ , గ్యాంగ్ స్ట‌ర్ ఛోటా ష‌కీల్ బావ స‌లీం ఖురేషీ అలియాస్ స‌లీం ప్రూట్ ల‌తో స‌హా 10 ప్రాంతాల్లో సోదాలు చేప‌ట్టింది ఈడీ.

ఇప్ప‌టికే జైలులో ఉన్న క‌స్క‌ర్ ను గ‌తం వారం ఈడీ క‌స్ట‌డీలోకి తీసుకుంది. పార్కర్ కుమారుడిని కూడా అరెస్ట్ చేసింది.

ఇదిలా ఉండ‌గా మోదీ ప్ర‌భుత్వం కావాల‌ని బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌ను, వ్య‌క్తుల‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తోందంటూ శివ‌సేన పార్టీ అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ ఆరోపించారు.

ఎన్సీపీ నాయ‌కురాలు సుప్రియా సూలే సైతం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read : బందోబ‌స్తు మ‌ధ్య ఓటేసిన అజ‌య్ మిశ్రా

Leave A Reply

Your Email Id will not be published!