Ukraine Emergency : ఉక్రెయిన్ లో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ

ర‌ష్యాతో ఉద్రిక్త‌త త‌గ్గేంత దాకా

Ukraine Emergency : ఉక్రెయిన్ – ర‌ష్యా దేశాల మ‌ధ్య యుద్దం అనివార్యం అవుతున్న త‌రుణంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందేమోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. ఓ వైపు యూర‌ప్ దేశాలతో పాటు అమెరికా ర‌ష్యాపై ఆర్థిక ఆంక్ష‌లు విధించాయి.

యూకేతో పాటు జ‌ర్మ‌నీ కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌క‌టించాయి. ఇరు దేశాలు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇక వార్ మొద‌ల‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. దీంతో ఉక్రెయిన్ ప్ర‌భుత్వం(Ukraine Emergency) అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మైంది.

ఈ సంద‌ర్భంగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు అధికార‌కంగా దేశ‌మంత‌టా అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ (Ukraine Emergency) విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దేశ‌మంత‌టా ఈ ఎమెర్జెన్సీ 30 రోజుల పాటు కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

అప్ప‌టి దాకా ఉక్రెయిన్ , ర‌ష్యా దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితులు త‌గ్గితే ఎమ‌ర్జెన్సీని ఎత్తి వేస్తామ‌ని లేక పోతే మ‌రికొన్ని రోజులు పొడిగించ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించి.

ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యానికి ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరింది. దేశంలోని వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్ స్క్ , లుహాన్ స్క్ లో త‌ప్ప దేశంలో మిగ‌తా అన్ని ప్రాంతాల్లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి నెల రోజుల పాటు కొన‌సాగుతుంద‌ని ఉక్రెయిన్ దేశ చీఫ్ సెక్యూరిటీ వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా వేర్పాటు వాద ప్రాంతాల‌ను ర‌ష్యా ప్ర‌భుత్వం దౌర్జ‌న్యంగా త‌న ఆధీనంలోకి తీసుకుంది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది ఐక్య రాజ్య స‌మితి. యూర‌ప్ తో పాటు అమెరికా సైతం మండిప‌డింది.

వీటికి స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్పిస్తున్న‌ట్లు ర‌ష్యా చీఫ్ పుతిన్ ప్ర‌క‌టించ‌డంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది.

Also Read : మోదీతో చ‌ర్చించేందుకు సిద్దం – ఇమ్రాన్ ఖాన్

Leave A Reply

Your Email Id will not be published!