KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం సంక్షేమం కోసం, పురోభివృద్ధి కోసం అవసరమైతే తన రక్తాన్ని ధార పోసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు.
జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తా. ఢిల్లీలో జెండా ఎగుర వేస్తా అని అన్నారు. ఈ దేశాన్ని ధర్మ మార్గంలో నడిపించేందుకు ముందుకు కదులుతానని, ఇందుకు మీ అందరి ఆశీస్సులు కావాలని కోరారు.
ఆనాడు బక్కపల్చటోడని ఎగతాళి చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదని ప్రగల్భాలు పలికారు. కానీ ఒక్కడినే బయలు దేరిన. రాష్ట్రం ఏర్పాటు అయ్యేంత వరకు ఢిల్లీ నుంచి రానని ప్రకటించిన.
సాధించి చూపించిన. కరెంట్ ఏడిస్తడని మాట్లాడిండ్రు. పాలన సరిగా రాదన్నరు. కానీ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తయారు చేసిన. ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా చేసిన.
ఇదంతా మీరు అందించిన శక్తి. అదే శక్తిని మీరుకు నాకు అందిస్తే ముందుకు కదులుతా . అనుకున్నది సాధిస్తా. మళ్లీ విజేతగా నిలుస్తానని అన్నారు సీఎం కేసీఆర్.
ఈ దేశంలో అపారమైన వనరులు, అవకాశాలు ఉన్నాయి. టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి. కానీ వాటిని వాడుకునే సామర్థ్యం ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు.
చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు దేశాన్ని కాపాడుతా. యుద్దం చేస్తానని ప్రకటించారు సీఎం. మల్లన్న జలాశయం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్(KCR) ప్రసంగించారు.
Also Read : విఆర్ఏలను ఆదుకోక పోతే ఆందోళన