Joe Biden Putin : యుద్ధం ఆప‌క పోతే దాడులు త‌ప్ప‌వు

ర‌ష్యాను హెచ్చ‌రించిన అమెరికా చీఫ్

Joe Biden Putin  : ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు ఆప‌క పోతే యుద్దం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్. ప్రాణ న‌ష్టం, ఆస్తి న‌ష్టం జ‌రిగితే దానికి పూర్తి బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌పంచం ర‌ష్యాను జ‌వాబుదారీగా ఉంచుతుంద‌న్నారు. ఉక్రెయిన్ పై దాడిని పూర్తిగా ఖండిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు బైడెన్(Joe Biden Putin ). ఇవాళ ఉద‌యం 6 గంట‌ల‌కు ర‌ష్యా చీఫ్ పుతిన్ యుద్ధానికి రెడీ చేశాడు.

నాటో, అమెరికాకు ఒక ర‌కంగా ర‌ష్యా వార్నింగ్ ఇచ్చాడు. యూర‌ప్ దేశాల‌తో పాటు అమెరికా ఆర్థిక ఆంక్ష‌ల్ని విధించినా డోంట్ కేర్ అని ప్ర‌క‌టించాడు.

పాశ్చాత్య ఆగ్ర‌హాన్ని, యుద్ధాన్ని ప్రారంభించ వ‌ద్దంటూ ప్ర‌పంచం విన్న‌వించినా వాటిని ధిక్క‌రిస్తున్న‌ట్లు తెలిపాడు ర‌ష్యా. సైనికులు త‌మ ఆయుధాల‌ను విర‌మించు కోవాల‌ని పిలుపునిచ్చినా ప‌ట్టించు కోలేదు.

బాంబుల మోత మోగిస్తోంది. మిస్సైల్స్ తో విరుచుకు ప‌డుతోంది. ఉక్రెయిన్ సైతం ర‌ష్యాతో ఢీకొట్టేందుకు రెడీ ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో పుతిన్ దీనిని సీరియ‌స్ గా తీసుకున్నారు.

ప్ర‌స్తుతం నాటో, అమెరికాల‌ను నివ‌రించ‌డంలో భాగంగా ర‌ష్యా ప్రీ ప్లాన్ గా వార్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఉక్రెయిన్ లో 11 న‌గ‌రాల‌పై ప‌ట్టు సాధించింది. ఐక్య రాజ్య స‌మితి అత్య‌వ‌స‌రంగా స‌మావేశమైంది.

ఇదిలా ఉండ‌గా ప్ర‌పంచంపై ప‌ట్టు కోసం ర‌ష్యా, చైనా, అమెరికా పోటీ ప‌డుతున్నారు. మ‌ద గ‌జాల మ‌ధ్య యుద్దం మొద‌లైంది. ఈ వార్ లో ఎవ‌రు గెలుస్తార‌నేది వేచి చూడాలి.

ఒక వేళ ఉక్రెయిన్ లో నాటో, అమెరికా దేశాలు ఎంట‌రైతే ఊరుకోబోమంటూ హెచ్చ‌రించారు ర‌ష్యా చీఫ్ పుతిన్.

Also Read : డ్రాగ‌న్ తో ఇండియాకు పెను ముప్పు

Leave A Reply

Your Email Id will not be published!