Biden Imran Khan : ఉక్రెయిన్ పై ఏకపక్షంగా రష్యా దాడికి దిగడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది అమెరికా. ఇదే సమయంలో యుద్దాన్ని విరమించుకోక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు జోసెఫ్ బైడెన్.
ఇదే క్రమంలో యుద్దం ప్రకటించే కంటే రెండు రోజులకు ముందు పాకిస్తాన్ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Biden Imran Khan)రష్యా లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం అయ్యారు.
రష్యా టీవీతో మాట్లాడుతూ భారత దేశంతో సన్నిహిత సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. పనిలో పనిగా టీవీ డిబేట్ కు మోదీతో సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు ఇమ్రాన్ ఖాన్.
ఈ తరుణంలో ఇమ్రాన్ ఖాన్ టూర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అమెరికా. రష్యా, పశ్చిమ దేశాల మధ్య పెరుగుతున్న సంక్షోభం మధ్య రష్యా దళాలు తూర్పు ఉక్రెయిన్ లోని వేర్పాటువాద ప్రాంతాల్లోకి ప్రవేశించిన తర్వాత రష్యా చీఫ్ తో సమావేశం అయిన మొట్ట మొదటి విదేశీ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ కావడం విశేషం.
రష్యాను నిలువరించాల్సిన బాధ్యత ప్రతి దేశంపై ఉందని స్పష్టం చేసింది అమెరికా. ఉక్రెయిన్ లో పరిస్థితిపై అమెరికా తన వైఖరిని పాకిస్తాన్ కు తెలియ చేసిందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు.
యుద్దంపై దౌత్యాన్ని కొనసాగించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను వివరించామని తెలిపారు. పాకిస్తాన్, రష్యా దేశాల మధ్య ఒప్పందం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : యుద్ధం ఆపక పోతే దాడులు తప్పవు